Home » 30వెడ్స్21 అనన్య గురించి ఎవరికి తెలియని నిజాలు ఇవే..!!

30వెడ్స్21 అనన్య గురించి ఎవరికి తెలియని నిజాలు ఇవే..!!

Ad

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. వెబ్ సిరీస్ ద్వారా కూడా ఎంతోమంది నటీనటులు వారి టాలెంట్ ను బయట పెట్టుకుంటున్నారు. కొంతమంది ఓవర్ నైట్ లోనే మంచి స్టార్లుగా ఎదుగుతున్నారు. అలా 30 వెడ్స్ 21 అనే వెబ్ సిరీస్ ఎంతటి ప్రాచుర్యం పొందిందో మనందరికీ తెలుసు. ఇందులో హీరోయిన్ గా చేసిన అనన్య శర్మ చాలా ఫేమస్ అయిపోయింది. మరి ఆమె గురించి ఎవరికీ తెలియని నిజాలు తెలుసుకుందాం..

also read:Chikoti Praveen: థాయ్‌లాండ్ పోలీసులకు చిక్కిన చికోటి ప్రవీణ్.. ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?

Advertisement

అనన్య శర్మ జన్మస్థలం వరంగల్ జిల్లా. కానీ ఆమె చెన్నైలోని విఐటి కాలేజీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. చిన్నతనం నుంచే సినిమాలంటే ఎక్కువ ఇష్టం. ఓ రోజు యూట్యూబ్ ఛానల్లో నటించే అవకాశం రావడంతో నటన వైపు అడుగులు వేసింది. ఏదో సరదాగా చేసిన సినిమా ఆమెను ఒక్కసారిగా యూట్యూబ్ స్టార్ ను చేసింది. ఆ తర్వాత బాయ్స్ ఫార్ములా, చాయ్ బిస్కెట్ వంటి చానల్స్ లోనే కాకుండా షార్ట్ ఫిలిమ్స్ లో కూడా చేసి బాగా పాపులర్ అయింది.

Advertisement

also read:ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. గోపీచంద్ ఆసక్తికర కామెంట్స్..!

30 సంవత్సరాల వయసున్న అబ్బాయిని 21 ఏళ్ల వయసున్న అమ్మాయి పెళ్లి చేసుకుంటే వచ్చే గొడవలు సర్దుబాట్లు సరదాలతో చిత్రీకరించిన ఈ వెబ్ సిరీస్ లో అనన్య చక్కగా నటించింది. ఈ ఒక్క సినిమా ద్వారానే ఆమె చాలా గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళం,హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన లాలిపాప్ అనే కవర్ సాంగుతో అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న మరో రెండు వెబ్ సిరీస్ లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

also read:ఆ ప్రైవేట్ ప్లేస్ లో టాటూ వేయించుకున్న సంయుక్త మీనన్…అతని పేరు వేయించుకుందా !

Visitors Are Also Reading