పోషకాలతో కూడిన ఆహారం ఆరోగ్యానికి చాలా అవసరం. దీని వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు అన్ని అందుతాయి. శరీరంలోని అన్ని అవయవాలకు బలాన్ని అందిస్తాయి. అన్ని అవయవాలు సక్రమంగా పని చేసే సామర్థ్యాన్ని అందిస్తాయి. శరీరంలో పోషకాల లోపం ఏర్పడినప్పుడు సమస్యలు ప్రారంభమవుతున్నాయి.
Also Read : పరగడుపున వెల్లుల్లిని తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Advertisement
విటమిన్లు మన శరీరానికి అత్యంత అవసరం అయినా పోషకాల్లో ఒకటి. ఆహారం నుంచి విటమిన్లు లభిస్తాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు లభించినప్పుడు శరీరం ముందుగా కొన్ని సంకేతాలను అందిస్తుంది. ఆ సంకేతాలను అస్సలు విస్మరించకూడదు. ఆ లక్షణాలను మనం పట్టించుకోకపోతే పలు వ్యాధులు కారణం కావచ్చు.
విటమిన్లు లోపించినప్పుడు కనిపించే లక్షణాలు :
Advertisement
- నోటి పూత సమస్య, పెదాల చివర పగుళ్లు ఏర్పడవచ్చు. థయామిన్, రైబో ఫ్లావిన్, పిరిడాక్సిన్, ఐరన్ పుష్కలంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
- బలహీనమైన జుట్టు, గోర్లు శరీరంలో విటమిన్లు లోపించినప్పుడు జుట్టు, గోర్లు బలహీనం అవుతాయి. విటమిన్లు లేకపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. గోర్లు విరిగిపోతాయి. అలా జరిగినప్పుడు విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
- జింక్ నియాసిన్, రిబోఫ్లావిన్,పిరిడాక్సిన్ తక్కువగా తీసుకోవడం వల్ల తలపై పొలుసులు, మచ్చలు ఏర్పడుతాయి. ఈ పొలుసులు, కనుబొమ్మలు, చెవులు, కనురెప్పలు, ఛాతీపై వస్తాయ. పోషకాలను ఆహారంలో తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
- చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్య చాలా మందికి ఉంటుంది.విటమిన్ల లోపం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. విటమిన్ సి లోపం వల్ల చిగుళ్ల సమస్యతో పాటు రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది.
- విటమిన్ ఏ తక్కువగా తీసుకోవడం వల్ల రాత్రిపూట చూపు సరిగ్గా ఉండదు. మీ ఆహారంలో ఎక్కువ విటమిన్ ఏ ఉండే ఆహారాలను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించడానికి ప్రయత్నించవచ్చు.
Also Read : ఆదివారం రోజు మాంసం తింటే ఏమవుతుందో తెలుసా ?