Home » డయాబెటిక్ పేషెంట్స్ అధిక బరువు పెరగడానికి కారణాలు ఇవే..!

డయాబెటిక్ పేషెంట్స్ అధిక బరువు పెరగడానికి కారణాలు ఇవే..!

by Anji
Ad

ప్రస్తుతం ప్రపంచంలో అధిక మంది బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఈ వ్యాధి చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. షుగర్ గతంలో వృద్ధాప్యం ఉన్న వారికి ఎక్కువగా వచ్చేది. కానీ ప్రస్తుతం 30 ఏళ్ల యువతలో కూడా ఈ వ్యాధి వ్యాపిస్తోంది. షుగర్ వ్యాధి ఉన్నవారు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ వ్యాధిని నియంత్రించడం చాలా కష్టమవుతోంది అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగినప్పుడు వచ్చే పరిస్థితిని డయాబెటిస్ అంటారు. ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల ఇది సంభవిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. ఇక వీరు బరువు తగ్గడం చాలా కష్టమైన పని అనే చెప్పాలి. ఎందుకంటే ఇందుకు చాలా కారణాలున్నాయి. ప్రధానంగా ఈ మూడు సమస్యల కారణంగా విపరీతంగా బరువు పెరుగుతారు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Manam News

Advertisement

Advertisement

  • కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారపదార్థాల్లో తీసుకోవడం వల్ల అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఈ ఆహారాల వల్ల డయాబెటిస్ పేషెంట్లు అధిక బరువు పెరుగుతుంటారు. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వ్యక్తుల్లో శరీరం ఇన్సులిన్ చర్యను నిరోధిస్తుంది. దీని ద్వారా ఇన్సులిన్ రక్తం నుంచి గ్లూకోజ్ ని తొలగించడంలో పెద్దగా ప్రభావం చూపించడం లేదు. దీంతో కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కర స్థాయిలు మరింతగా పెరుగుతాయి. ఇక డయాబెటిక్ వ్యాధి గ్రస్తులకు బరువు తగ్గడం చాలా కష్టమవుతుంది.
  • ముఖ్యంగా డయాబెటిస్  సమస్యతో బాధపడే వ్యక్తులకు ఎక్కువ ఆకలి ఉంటుంది. దీంతో రక్తంలో చక్కర స్థాయిలు ఎక్కువగా పెరగడంతో అధిక బరువు పెరుగుతుంటారు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయి.  కొద్ది సేపటికే రక్తంలో ప్రభావం తగ్గినప్పటికీ మళ్లీ ఆకలిని ప్రేరేపిస్తున్నాయి. డయాబెటిస్ రోగులు రోజులో ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకుంటారు. 

Also Read :   ఈ సమస్య ఉన్నవారు ఎండు చేపలకు దూరంగా ఉండాల్సిందే..!

Manam News

  • ఇన్సులిన్ కొవ్వును నిలువ చేయడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ చికిత్సకి ఇన్సులిన్ తీసుకోవడం కూడా కొంత మేరకు బరువు పెరగడానికి కారణమవుతుంది. డయాబెటిస్ వాడే కొన్ని మందులు బరువు పెరగడానికి తోడ్పడుతాయి. అవి ఇన్సులిన్  ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీని ద్వారా బరువు పెరుగుతారు. రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించడానికి ఉత్తమమైన మార్గం కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోవడం.. అంతేకాదు వీరు వైద్యులు సూచించిన డైట్ ఫాలో కావాల్సి ఉంటుంది. అప్పుడే బరువు నియంత్రణలో ఉంటుంది. 

Also Read :  ఈ సమస్య ఉన్నవారు ఎండు చేపలకు దూరంగా ఉండాల్సిందే..!

Visitors Are Also Reading