Home » ఈ సమస్య ఉన్నవారు ఎండు చేపలకు దూరంగా ఉండాల్సిందే..!

ఈ సమస్య ఉన్నవారు ఎండు చేపలకు దూరంగా ఉండాల్సిందే..!

by Anji
Ad

సాధారణంగా మనం క్వాలిటీ ఫుడ్ తినడం చాలా ముఖ్యం. కరోనా తరువాత అందరికీ తెలిసివచ్చింది. అందరూ ఫాట్ ఫుడ్ వదిలేసి.. ప్రోటీన్ ఫుడ్ వైపు పరుగులు తీస్తున్నారు. అనారోగ్య కారణమని తెలిస్తే.. ఆ ఫుడ్ ఎంత ఇష్టమైనా సరే.. ఆ ఫుడ్ ని అవైడ్ చేసేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చిన్న వయస్సులోనే షుగర్లు, బీపీలు, హార్ట్ ఎటాక్స్ వంటి వాటి గురించి తరుచూ వింటుంటాం. 

Advertisement

వీటి కోసం జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలోనే ఎండు చేపల గురించి మీరు తప్పక తీసుకోవాలి. చాలా మంది ఎంతో ఇష్టంగా ఎండు చేపలను తింటుంటారు. రకరకాల కూరలలో మిక్స్ చేసి డైలీ తినేవారు కూడా ఉన్నారు. సముద్ర తీర ప్రాంతాలకు దగ్గరగా ఉంటున్న వారు ఎండు చేపలు ఎక్కువగా తీసుకుంటుంటారు. ఎండు చేపలలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వాస్తవమే కానీ.. ఒక వ్యాధి ఉన్న బాధితులు మాత్రమే ఎండు చేపల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. 

Also Read :  చలికాలంలో జుట్టు రాలుతోందా? అయితే ఈ టిప్స్ పాటించండి !

Advertisement

Manam News

అధిక రక్తపోటు అన్నది మిలియన్ల మంది జనాలను పట్టి పీడిస్తున్న సమస్య. దీనిని హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తుంటారు. ఎండు చేపలు ఎక్కువగా తినడం వల్ల మనిషి శరీరంలో రక్తపోటు పెరిగి.. గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని పలు పరిశోధనలలో తేలింది. అధిక రక్తపోటు ఉన్నవారు ఎండు చేపలకు తినకపోవడమే మంచిది అని డైటీషియన్లు సూచిస్తున్నారు. ఎండు చేపలు శరీరంలో ఉప్పు శాతాన్ని పెంచుతాయి. బాడీలో ఉప్పు ఎక్కువగా చేరినప్పుడు, రక్తం రక్తనాళాలను అధిక ఒత్తిడికి గురి చేస్తుంది. దీంతో బీపీ అధికమవుతుంది. శరీరంలోని హార్మోన్లు, ఇన్ ప్లమేటరీ, ఇమ్యునోలాజికల్, జీర్ణవ్యవస్థలను ఎఫెక్ట్ చేసే గుణాలు ఉప్పులో ఉంటాయి. ఎండు చేపల ద్వారా శరీరంలో ఉప్పు శాతం రోజు రోజుకు పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు దానిని అవైడ్ చేయడం చాలా బెటర్. శరీరంలో ఉప్పు శాతం పెరిగితే.. మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం ఉంటుంది. 

Also Read :  Health Tips : రాత్రిపూట పొరపాటున కూడా వీటిని తినవద్దు..!

Visitors Are Also Reading