టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 11న ఉదయం 3.16 గంటలకు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆయన మరణించడానికి గల కారణాలను ఏఐజీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి ఏఐజీ ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటనను విడుదల చేసింది.
Advertisement
నటుడు కృష్ణంరాజుకి 83 సంవత్సరాలు. ఆయనకు డయాబెటిస్ ఉంది. పోస్ట్ కోవిడ్ లక్షణాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ రావడంతో మృతి చెందాడు. అంతేకాదు.. చాలా కాలంగా ఆయనకు గుండె కొట్టుకునే విషయంలో సమస్య కూడా ఉందట. అందుకోసం అతను చికిత్స తీసుకుంటున్నాడు. ఇక ఒంట్లో రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో గత సంవత్సరం ఆయన కాలికి ఒక ఆపరేషన్ కూడా చేశారు. మరోవైపు కిడ్నీలు, ఊపిరితిత్తుల సమస్యలతో కృష్ణంరాజు బాధపడ్డాడు. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బ తింది. ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి ఆయనను వెంటిలెటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ట్రీట్‌మెంట్ అందించారు. పోస్ట్ కోవిడ్ లక్షణాలతో సెప్టెంబర్ 05 తేదీన కృష్ణంరాజు ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.
Advertisement
ఇది కూడా చదవండి : టాలీవుడ్‌లో మరో విషాదం.. రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత
ఇక అదే సమయంలో ఆయనకు ఊపిరితిత్తుల్లో న్యూమోనియా ఉంది. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో న్యూమోనియా తలెత్తినట్టు వైద్యులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 3.16 గంటలకు గుండెపోటు రావడతో కృష్ణం రాజు మరణించారని ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కృష్ణంరాజు పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కృష్ణంరాజు నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు తదితరులు కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఇది కూడా చదవండి : Krishnam Raju Death : కృష్ణంరాజు అనారోగ్యానికి అసలు కారణం అదేనా..?