Home » Krishnam Raju Death : కృష్ణంరాజు అనారోగ్యానికి అస‌లు కార‌ణం అదేనా..?

Krishnam Raju Death : కృష్ణంరాజు అనారోగ్యానికి అస‌లు కార‌ణం అదేనా..?

by Anji
Ad

తెలుగు సినీరంగంలో ఆయ‌న ఒక రెబ‌ల్ స్టార్‌. తొలుత హీరోగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన‌ప్ప‌టికీ త‌రువాత కొన్ని చిత్రాల్లో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌ల‌తో అల‌రించారు. వ‌రుస‌గా విల‌న్ చిత్రాలు చేసిన ఆయ‌న కొద్ది కాలంలోనే హీరోగా మ‌ళ్లీ పుంజుకున్నాడు ఉప్ప‌ల‌పాటి చిన‌వెంక‌ట కృష్ణంరాజు. ఇంటి పేరులోని శ్రీ ని పేరులోని చిన వెంక‌ట ప‌దాల‌ను తొల‌గించుకొని కృష్ణంరాజుగా తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు.

 

Advertisement

అత‌ని చ‌దువు పూర్తి కాగానే జ‌ర్న‌లిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించారు. కృష్ణంరాజు మ‌ర‌ణంతో సినీ ప్ర‌పంచమంతా ఒక్క‌సారిగా షాక్‌కి గురైంది. కృష్ణంరాజుకి అస‌లు ఏమైంది..? ఆయ‌న ఆరోగ్య స‌మ‌స్య‌లు ఏంటి..? ఆయ‌న కార‌ణంగా చ‌నిపోయార‌నేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కృష్ణంరాజు గ‌త నెల రోజులుగా పోస్ట్ కోవిడ్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. గ‌త నెల 5న గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆసుప‌త్రిలో చేర్పించారు. పోస్ట్ కోవిడ్ కార‌ణంగా చికిత్స అందించే క్ర‌మంలో ఆయ‌న‌కు ఊపిరితిత్తుల్లో నిమోనియా, కిడ్ని ప‌నితీరు స‌క్ర‌మంగా లేదు. వెంటి లెట‌ర్ పై చికిత్స అందించాం. గుండె వేగం త‌గ్గింది అని ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ నేప‌థ్యంలోనే ఆదివారం తెల్ల‌వారుజామున 3.16కు గుండెపోటుతో చ‌నిపోయార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా మ‌ల్టీ ఆర్గాన్ ల స‌మ‌స్య వ‌ల్ల‌నే ఆయ‌న ఆరోగ్యం క్షీణించింద‌నే చెప్ప‌వ‌చ్చు.

Advertisement


ఇటీవ‌ల కాలంలో చాలా మంది ప్ర‌ముఖుల మ‌ర‌ణాల వెనుక పోస్ట్ కోవిడ్ అనేది మ‌నం త‌రుచూ వింటూనే ఉన్నాం. ఇక కృష్ణంరాజు మృతికి పోస్ట్ కోవిడ్ తో పాటు కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. కృష్ణంరాజు అంత్య‌క్రియ‌లు రేపు నిర్వ‌హించ‌నున్నారు. రేపు ఉద‌యం ఫిల్మ్ ఛాంబ‌ర్ కి భౌతిక కాయాన్ని తీసుకెళ్ల‌నున్నారు. అక్క‌డ నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు మ‌హా ప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. 1966లో వ‌చ్చిన చిల‌క గోరింకా చిత్రంతో కృష్ణంరాజు వెండితెర‌కు హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. తొలిచిత్రం ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. దీంతో ఆయ‌న చాలా నిరాశ ప‌డ్డారు.

ఇది కూడా చ‌ద‌వండి :  బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డ పూరీజ‌గ‌న్నాథ్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్…..? కార‌ణం అదేనా..?


ఇక ఆ త‌రువాత అవే క‌ళ్లు చిత్రంలో విల‌న్ గా న‌టించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కృష్ణంరాజు. అప్ప‌టి నుంచి వ‌రుస‌గా 30 సినిమాల్లో విల‌న్ పాత్ర‌లే పోషించారు. విల‌నిజంలో కూడా ప్ర‌త్యేక‌త ఉంటేనే చేస్తాన‌ని క‌రాఖండిగా చెప్పేవార‌ట‌. అప్ప‌ట్లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభ‌న్‌బాబు, కృష్ణ చిత్రాల్లో విల‌క్ష‌ణ‌మైన ప్రతినాయ‌కుడి పాత్ర‌లు పోషించి యంగ్ విల‌న్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్ర‌ధానంగా అబిడ్స్‌లో ఓ రోజు కాఫీ తాగుతున్న కృష్ణంరాజును అక్కాచెల్లెళ్లు సినిమా ద‌ర్శ‌కుడు ప‌ద్మ‌నాభ‌రావు చూశారు అచ్చం హీరోలా ఉన్నావు.. సినిమాలో న‌టిస్తావా అని అడిగార‌ట‌. ఇక ఆయ‌న అడ‌గ‌డ‌మే ఆల‌స్యం ఎవ‌రికీ చెప్ప‌కుండానే మ‌ద్రాస్ వెళ్లారు.

ఇది కూడా చ‌ద‌వండి : టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు క‌న్నుమూత

Visitors Are Also Reading