ప్రేమ ఎప్పుడూ ఒకేళా ఉండదు. పెళ్లికి ముందున్న ప్రేమ పెళ్లి తరవాత ఉండదు. ఇది ఆరెంజ్ సినిమాలోని డైలాగ్ ఇది సినిమా డైలాగ్ అయినప్పటికీ నిజజీవితంలోనూ ఇది చాలా జంటల్లో కనిపిస్తుంది. కాగా పెళ్లికి ముందుకు ఉన్న ప్రేమ పెళ్లి తరవాత లేకపోవడంతో విడిపోతున్నవాళ్లు కూడా ఉన్నారు. అరేంజ్ మ్యారేజెస్ లోనే కాకుండా లవ్ మ్యారేజ్ లలో కూడా పెళ్లి తరవాత ప్రేమ తగ్గిపోయి విడిపోతున్నవాళ్లు ఉన్నారు. అయితే పెళ్లి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తరవాత ఉండకపోవడానికి ఐదు కారణాలు ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: భోజనం చేసిన తరువాత ఎట్టి పరిస్థితిలో కూడా ఈ పనులు అస్సలు చేయకండి..!
Advertisement
అవేంటో ఇప్పుడు చూద్దాం….పెళ్లికి మందు ఒకరికొకరు చాలా సమయం కేటాయించుకుంటారు. కానీ పెళ్లి తరవాత మాత్రం పిల్లల వల్ల కుటుంబం వల్ల ఒకరితో మరొకరు గడపడానికి పెద్దగా సమయం దొరకదు. దాంతో ఇద్దరి మధ్య దూరం ఏర్పడుతుంది. పెళ్లికి ముందు కొంతమంది చాలా గొప్పలు చెప్పి పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లి తరవాత మాత్రం రియాలిటీ మరోవిధంగా ఉంటుంది.
Advertisement
ఇవి కూడా చదవండి: నరాల బలహీనతతో బాధపడే వారికి ‘సీతాఫలం’ గొప్ప ఔషదం..!
వారు ఊహించిన జీవితం ఉండకపోవచ్చు. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్దలు వస్తాయి. ఆ కారణంతో కూడా విడిపోతున్నావాళ్లు చాలా మంది ఉన్నారు. పెళ్లికి ముందు తమ లోకంలో ఇద్దరే విహరిస్తారు. కానీ పెళ్లి తరవాత అత్తమామ ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. వారితో ఎవరితో ఇబ్బంది తలెత్తినా కూడా భార్య భర్తల మధ్య గొడవలు మొదలవుతాయి.
అంతే కాకుండా పెళ్లికి ముందు కొత్తలో ఎక్కువగా ప్రేమించుకుంటారు. కానీ పెళ్లి తరవాత కొన్నాళ్లకు బోర్ కొట్టేస్తుంది. అలా బోర్ కొట్టడం కూడా ఒకకారణం అవుతుంది. ఒక వ్యక్తిని అందం లేదా డబ్బు చూసి వాటి కోసమే పెళ్లి చేసుకుంటే కూడా ఆ తరవాత వ్యామోహం తగ్గి ప్రేమ తగ్గిపోతుంది.
ఇవి కూడా చదవండి: ప్రతి రోజు పరిగడుపున ఈ డ్రింక్ తాగితే చాలు.. మీ పొట్ట కరగడం ఖాయం..!