Home » ప్ర‌తి రోజు ప‌రిగ‌డుపున ఈ డ్రింక్ తాగితే చాలు.. మీ పొట్ట క‌ర‌గ‌డం ఖాయం..!

ప్ర‌తి రోజు ప‌రిగ‌డుపున ఈ డ్రింక్ తాగితే చాలు.. మీ పొట్ట క‌ర‌గ‌డం ఖాయం..!

by Anji
Ad

ప్ర‌స్తుతం ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య అధిక బ‌రువు. ముఖ్యంగా మారిన ఆహార‌పు అలవాట్లు, శారీర‌క శ్ర‌మ త‌గ్గ‌డంతో భారీగా బ‌రువు పెరుగుతున్నారు. ఇక 20 ఏళ్ల‌కే పెద్ద పొట్ట వేసుకొని తిరుగుతున్నారు. స్లిమ్ గా క‌నిపించేందుకు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్ర‌ధానంగా అధిక బ‌రువు,ఊబ‌కాయం ఉన్న వారిలో అయితే ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. గుండె కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంటుంది. అందువ‌ల్ల అంద‌రూ స్ట్రాంగ్‌గా, ఫిట్‌గా ఉండేందుకు కొన్ని చిట్కాల‌ను పాటిస్తుంటారు. తొంద‌ర‌గా బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు అల్లం, నిమ్మ‌ర‌సాన్ని ఆహారంలో యాడ్ చేసుకోవాలి. అల్లం, నిమ్మ‌కాయ ర‌సం క‌లిపి తీసుకుంటే అది క‌డుపు చుట్టు ఉన్న కొలెస్ట్రాల్‌ని తొంద‌ర‌గా కరిగిస్తుంది. వీటిని ప్ర‌తి రోజూ తీసుకోవ‌డం ద్వారా ఎన్నో ర‌కాల ఇబ్బందుల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ప‌రిగ‌డుపున నిమ్మ‌రసం, అల్లం తీసుకోవ‌డం వల్ల క‌లిగే లాభాలు ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


పొట్ట చుట్టూ ఉండే కొవ్వు నిమ్మ‌ర‌సం అల్లం తీసుకోవడం వ‌ల్ల తొంద‌ర‌గా క‌రిగిపోతుంది. వీటిలో విట‌మిన్ సీ అధికంగా ఉంటుంది. ఇవి తీసుకోవ‌డం ద్వారా ఊబ‌కాయం త‌గ్గించ‌డంలో చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతాయి. నిమ్మ‌కాయ‌, అల్లం శ‌రీరాన్ని శుభ్రం చేయ‌డానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతాయి. వీటిలో ర‌క‌ర‌కాల పోష‌కాలుంటాయి. నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం ఎప్ప‌టిక‌ప్పుడు క్లీన్ కావ‌డానికి చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అదేవిధంగా వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ స‌ర్కులేష‌న్ బాగా జ‌రుగుతుంది. దీని కోసం అల్లం ముక్క‌లుగా క‌ట్ చేసుకుని నీటిలో వేసి మ‌రిగించిన త‌రువాత నీటిలో నిమ్మ‌ర‌సం క‌లుపుకొని నిత్యం రెండు మూడు సార్లు తీసుకోవ‌చ్చు. దీంట్లో కొంచెం తేనేను క‌లుపుకొని తాగ‌వ‌చ్చు.

Advertisement

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  ఇంజినీరింగ్ చ‌ద‌వాల‌నుకుంటే అటాన‌మ‌స్ కాలేజీలో చ‌ద‌వండి.. మీకు ఫుల్ బెనిఫిట్స్‌..!


జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను మెరుగు ప‌రుస్తుంది. ఇది జీర్ణ సంబంధిత వ్యాధుల‌తో ఇబ్బంది ప‌డుతుంటే నిత్యం అల్లం నిమ్మ‌ర‌సాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబ‌ర్ ర‌క‌ర‌కాల పోష‌కాలు క‌లిగిన జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను వేగ‌వంతం చేస్తాయి. ఈ మిశ్ర‌మం ఆహారాన్ని ఈజీగా జీర్ణం చేస్తుంది. వీటితో పాటు రాత్రి ప్ర‌తీ రోజూ నిద్ర‌పోయే ముందు రెండు మూడు వెల్లుల్లి రెబ్బ‌లు న‌మిలి మింగాలి. అదేవిధంగా ఉద‌యం నిద్ర‌లేచిన వెంట‌నే ప‌రిగ‌డుపున రెండు వెల్లుల్లి రెబ్బ‌లు తినాలి. ఇవి తిన్న త‌రువాత నిమ్మ‌ర‌సం, అల్లం తీసుకుంటే ఫ‌లితం ఇంకా బాగుంటుంది. ఇంకెందుకు ఆల‌స్యం ఈ చిట్కాను పాటించి మీ పొట్ట‌ను త‌గ్గించుకోండి.

ఇవి కూడా చ‌ద‌వండి :  రాష్ట్రపతి మెచ్చిన సీనియర్ ఎన్టీఆర్ సినిమా ఏదో తెలుసా….? స్పెషల్ షో చూసి మరీ..!

Visitors Are Also Reading