Home » కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే..!

కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే..!

by Anji
Ad

నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ డెవిల్. ఇవాళ ఈ చిత్రం విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో డెవిల్ షోలు కాస్త ఆలస్యంగానే వేశారు. కానీ ఇతర ప్రాంతాల్లో మాత్రం డెవిల్ షోలు కాస్త ముందస్తుగానే వేశారు. ముఖ్యంగా  డెవిల్ మూవీకి నెటిజన్ల నుంచి కూడా పాజిటివ్ టాక్ నడుస్తుండటం గమనార్హం. నందమూరి అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో ఆ అంచనాలను అందుకునేలా సినిమా ఉంది. కళ్యాణ్ రామ్ ఎంట్రీ సీన్, ట్విస్టులు, బీజిఎం ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ కు ఆ రేంజ్ హిట్ అని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

devil-movie

devil-movie

మాస్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించేలా ఈ సినిమా సెకండాఫ్ ఉంది. ఈ సినిమాలో థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఊహలకు అందని ట్విస్టులు ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఏజెంట్ రోల్ లో కళ్యాణ్ రామ్ అదరగొట్టగా హీరోయిన్ పాత్రకు సంబంధించి వచ్చే షాకింగ్ ట్విస్ట్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిదానంగా సాగే కథనం ఈ సినిమాకు ఒకింత మైనస్ అని చెప్పవచ్చు. పీరియాడిక్ సెటప్ ఈ సినిమాకు కలిసొచ్చింది.

Advertisement

Advertisement

2023 సంవత్సరానికి డెవిల్ సినిమాతో కళ్యాణ్ రామ్ మంచి ముగింపును ఇచ్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ మూవీ విడుదలై వారం కావడంతో బాక్సాఫీస్ వద్ద డెవిల్ మూవీకి ఎలాంటి సమస్య లేదని నెటిజెన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. డెవిల్ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ 20 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాకు ఆ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో లేదో చూడాలి. ఈ సినిమాకు పోటీగా విడుదలైన బబుల్ గమ్ సినిమాకు సైతం పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. 2023 లో వచ్చిన సినిమాలు అధికంగా   బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాలను దక్కించుకోవడం విశేషం.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading