Home » మార్చి నెలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..!

మార్చి నెలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..!

by Anji
Ad

ప్రస్తుత జనరేషన్ లో ఎంటర్ టైన్మెంట్ కు ఏ మాత్రం కొదవ లేదు . నెలకు 5, 6 సినిమాలు రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు మేకర్స్. ఇక ఈ నెలలో థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Advertisement

  • కన్నడ మాస్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో గోపిచంద్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సూపర్ హిట్ రెస్పాన్స్ తో టాప్ 2 ట్రెండింగ్ గా సాగుతోంది. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు.
  • మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ చిత్రం ‘గామీ’. విద్యాధర్ కాగిత ఈ సినిమాను తెరకెక్కించారు. విశ్వక్ సేన్ అఘోరాగా రూపొందిన ఈ మూవీ మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
  • హీరో శ్రీ విష్ణు , రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’. ఇటీవలే విడుదలైన మూవీ టీజర్ ‘నో లాజిక్‌.. ఓన్లీ మ్యాజిక్‌’ అనే ట్యాగ్ లైన్ తో కడుపుబ్బా నవ్వించింది. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా మార్చి 22న థియేటర్స్ లో విడుదల కానుంది.
  • అల్లరి నరేష్, జాతి రత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం ఈ సినిమాను తెరకెక్కించారు. హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హాస్య భరితంగా రూపొందిన ఈ మూవీ కూడా మార్చి 22న విడుదల కాబోతుంది.

Advertisement

  • సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాను విమల్ కృష్ణ తెరకెక్కించారు. టీజర్ తో ఫుల్ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
  • ఇదే రోజు బాలీవుడ్ తారలు కరీనా కపూర్‌, టబు, కృతిసనన్‌ నటించిన ‘ది క్రూ’ చిత్రం కూడా విడుదలకు సిద్ధమైంది. రాజేశ్‌ కృష్ణన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు.
  • పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో శివ కందుకూరి, రాశీసింగ్‌ కలిసి నటించిన ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’, కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన ‘చారి 111’ రెండు చిత్రాలు మార్చి 1న థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.
  • మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read :   అల్లు అర్జున్ కి అవార్డుకి రావాలని కోరుకున్న.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వైరల్..!

Visitors Are Also Reading