Home » ఈ ఏడాది నెటిజన్లు గూగుల్ లో ఎక్కువగా వెతికిన తెలుగు సినిమాలు ఇవే..!

ఈ ఏడాది నెటిజన్లు గూగుల్ లో ఎక్కువగా వెతికిన తెలుగు సినిమాలు ఇవే..!

by Anji
Ad

జీవితంలో వెళ్లిపోయిన కాలం మళ్లీ తిరిగి రాదు.. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యమని పలువురు మేధావులు సూచిస్తుంటారు. కానీ వాటిని చాలా తక్కువ మంది మాత్రమే పాటిస్తుంటారు.  ప్రస్తుతం మనం  చూస్తుండగానే 2022 సంవత్సరం ముగిసిపోయింది. మరికొద్ది రోజుల్లోనే 2023కి స్వాగతం పలికేందుకు అందరూ  సిద్ధమవుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లు గడ్డు కాలం ఎదుర్కుంది చిత్ర పరిశ్రమ. అదృష్టవశాత్తు ఈ సంవత్సరం అలాంటి సమస్యలు లేకుండా కాస్త సాఫీగానే సాగిందని చెప్పవచ్చు. 

Also Read :  సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలకు థియేటర్స్ ఎలా పంచారు ? ఎవరెవరికీ ఎన్ని అంటే ? 

Advertisement

 

ఈ ఏడాది ప్రారంభంలో కరోనా కాస్త భయపెట్టినప్పటికీ కొద్ది రోజులకే పరిమితమైంది. ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. ఓటీటీల ప్రభావం ఉన్నప్పటికీ సిల్వర్ స్క్రీన్ పైనే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. 2022 చివరి దశకు చేరుకోవడంతో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాల జాబితాను విడుదల చేసింది. నెటిజన్లు ఎక్కువగా శోధించిన సినిమాల జాబితాను కేటగిరిల వారిగా విడుదల చేసింది. 

Also Read :   మంచి పాత్ర‌ల‌ను రిజెక్ట్ చేసి న‌ష్ట‌పోయిన 10 మంది న‌టీమ‌ణులు వీళ్లే..ఎందుకు రిజెక్ట్ చేశారంటే..?

Advertisement

 

ఏయే కేటగిరిల వారిగా వెల్లడించిందంటే.. వరల్డ్ వైడ్, నేషనల్ వైడ్, సౌత్ ఇండియా, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ వంటి కేటగిరిలలో ఎక్కువ మంది గూగుల్ లో సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ ని వెల్లడించింది. టాప్ 10 తెలుగు సినిమాలను పరిశీలించినట్టయితే ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప సినిమా రెండో స్థానంలో చోటు దక్కించుకుంది. విజయ్ దేవరకొండ లైగర్ మూడోస్థానంలో, నిఖిల్ సిద్ధార్థ కార్తీకేయ 2 నాలుగో స్థానంలో, ప్రభాస్ రాధేశ్యామ్ 5వ స్థానంలో ఉన్నాయి. వీటితో పాటు దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం 6వ స్థాంలో నిలవగా.. మహేష్ బాబు సర్కారు వారి 7వ స్థానంలో, అడివి శేషు మేజర్ 8వ స్థానంలో, ప్రభాస్ ఆదిపురుష్ విడుదల కానప్పటికీ 9 వస్థానంలో నిలిచింది. ఇక నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా 10వ స్థానంలో చోటు దక్కించుకున్నాయి. 

Visitors Are Also Reading