Home » సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలకు థియేటర్స్ ఎలా పంచారు ? ఎవరెవరికీ ఎన్ని అంటే ? 

సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలకు థియేటర్స్ ఎలా పంచారు ? ఎవరెవరికీ ఎన్ని అంటే ? 

by Anji
Ad

సాధారణంగా సంక్రాంతి పండుగ అంటేనే సినిమాలకు పెద్ద మార్కెట్ అనే విషయం తెలిసిందే. ప్రతి ఏటా సంక్రాంతి పెద్ద హీరోల సినిమాలను ప్లాన్ చేస్తుంటారు దర్శక, నిర్మాతలు. 2020లో సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో.. సినిమాలు రెండు కూడా బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. 2021లో కరోనా కారణంగా విడుదల కాలేదు. 2022లో అక్కినేని నాగార్జున నటించిన బంగార్రాజు సూపర్ హిట్ గా నిలిచింది. 2023లో మాత్రం నాలుగు సినిమాలు పోటాపోటీగా విడుదలవుతున్నాయి. వాటిలో ఏ సినిమా ఎన్ని థియేటర్లలో విడుదలవుతుందనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

జనవరి 11, 2023 బుధవారం రోజు తమిళ హీరో అజిత్ నటించిన తునువు చిత్రం తెలుగులో తెగింపు గా విడుదలవుతోంది. జనవరి 12, 2023న నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, విజయ్ దళపతి నటించిన వారసుడు చిత్రాలు విడుదల కానున్నాయి. జనవరి 13, 2023 మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. అయితే తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి 1200 స్క్రీన్స్ ఉన్నాయి. వాటిలో తెలంగాణలో 400 స్క్రీన్స్ ఉంటే.. అందులో దాదాపు 215 వరకు హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఆంధ్రలో 800 వరకు ఉన్నాయి. వీటిలో ఏయే సినిమాలకు ఎన్ని థియేటర్లు దక్కనున్నాయో ఇప్పటికే ఎగ్జిబిటర్స్ పేర్కొంటున్నారు. 

Manam News

సంక్రాంతి బరిలోకి తొలుత ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా తునివు. ‘తెగింపు’ పేరుతో తెలుగులో డబ్బు అవుతోంది. ఈ చిత్రం జనవరి 11న విడుదలవ్వనుంది. తెలుగులో 450 స్క్రీన్స్ దక్కినట్టు సమాచారం. మొదటి రోజు సోలో రిలీజ్ కాబట్టి అజిత్ కి 450 కి పైగా థియేటర్స్ దక్కనున్నాయి. 

Advertisement

Also Read :  ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర..!

జనవరి 12న విజయ్ దళపతి వారసుడు సినిమాతో వస్తుంటే.. నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డితో రానున్నారు. వారసుడు సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో 300 నుంచి 320 వరకు స్క్రీన్స్ దక్కనున్నాయి. అజిత్ నుంచి 350 స్క్రీన్స్ తీసేసి విజయ్ వారసుడుతో పాటు బాలయ్య వీరసింహారెడ్డికి కేటాయించనున్నారు. బాలయ్య వీరసింహారెడ్డికి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 800 స్క్రీన్స్ లలో విడుదల చేయనున్నారు. ఈ సంక్రాంతి సీజన్ లో ఎక్కువ థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రం వీరసింహారెడ్డి కావడం విశేషం. 

Also Read :   సినిమా అభిమానులకు శుభవార్త.. ఒకే రోజు ఓటీటీలో ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయంటే ? 

Waltair Veerayya

బాలయ్య వీరసింహారెడ్డికి కేటాయించిన 800 థియేటర్ల నుంచి 400 స్క్రీన్లు జనవరి 13న విడుదలయ్యే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకి కేటాయించనున్నారు. విజయ్ దళపతి వారసుడు నుంచి 120 స్క్రీన్స్ లాగేసుకుని వాల్తేరు వీరయ్యకు కేటాయించనున్నారు. అజిత్ నుంచి 50 స్క్రీన్స్ కూడా చిరంజీవి సినిమాకే దక్కనున్నాయి. మొత్తానికి చిరంజీవి వాల్తేరు వీరయ్య తెలుగులో 570 స్క్రీన్లలో విడుదల కాబోతుంది. విడుదలైన సినిమాల ఫలితాలను బట్టి మళ్లీ థియేటర్లు పెరగడం తగ్గడం వంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఏది ఏమైనప్పటికీ సంక్రాంతి బరిలో తెలుగు సీనియర్ హీరోలు అయినటువంటి చిరంజీవి, బాలయ్య మధ్యే ప్రధాన పోటీ  ఉండనున్నట్టు తెలుస్తోంది. 

 Also Read :  ఆ ఇద్దరు స్టార్ హీరోలకు సిల్క్ స్మిత అంటే పిచ్చి ప్రేమట.. కానీ చివరికి..!!

Visitors Are Also Reading