స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ అప్పుడప్పుడూ అబద్ధాలు చెబుతుంటారు. అబద్ధాలు చెప్పడం మానవ సహజం. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో బయటపడేందుకు చిన్న చిన్న అబద్ధాలు ఆడుతుంటారు. అయితే, ఇది అందరికి వర్తించకపోవచ్చు. కొన్నిసార్లు ప్రజలు తమ నిజాన్ని దాచడానికి కూడా అబద్ధాలు చెబుతుంటారు. చాలా సందర్భాల్లో తప్పును దాచుకోవడానికి ఎదుటి వ్యక్తికి అబద్ధాలు చెబుతారు. కారణం లేకుండా అబద్ధాలు చెప్పేవాళ్లు కొందరున్నారు. సంబంధంలో అబద్ధాల గురించి మాట్లాడటం, వాదనలను నివారించడానికి, భాగస్వామితో పోరాడటానికి లేదా బాధపెట్టడానికి లేదా భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి చాలాసార్లు ప్రజలు అబద్ధాలు చెబుతారు. ఇటువంటి పరిస్థితిలో పురుషులు తమ భార్య లేదా స్నేహితురాలు లేదా స్నేహితులకు తరచుగా చెప్పే కొన్ని సాధారణ అబద్ధాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.
సంబంధంలో ఉన్నప్పుడు పురుసులు మరో స్త్రీ పట్ల ఆకర్షితులైనప్పుడు, వారు ఒంటరిగా ఉన్నారని ఆమెకు అబద్ధం చెప్పడం తరచుగా కనిపిస్తోంది. ఇలాంటి అబద్ధం చెప్పకపోతే ఎదుటి మహిళ తమతో మాట్లాడడం మానేస్తుందని పురుషులు భావిస్తుంటారు. పురుషులు తమ స్త్రీ భాగస్వాములతో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా మరో స్త్రీ ఎదురుగా వెళ్లినప్పుడు పురుషులు ఆమెను చూడడం ప్రారంభిస్తారు. ఇలా చూస్తున్నప్పుడు భాగస్వామి కంటపడితే తరచుగా పురుషులు తప్పించుకోవడం లేదా ఆ స్త్రీని చూడడం లేదని అబద్ధం చెబుతుంటారు. ఇక దూమపానం చేసిన వెంటనే వాసన రాకుండా ఏదేదో చేస్తుంటారు. అయినప్పటికీ ఏదో ఓ సందర్బంలో అసలు విషయం బయటపడుతుందట.
Advertisement
Advertisement
కొన్ని సార్లు పురుషులు భాగస్వామి హృదయాన్ని గెలుచుకోవడానికి లేదా వారిని బాధపెట్టకుండా ఉండడానికి నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నానంటూ అబద్దాలు చెబుతుంటారట. నువ్వులేకుండా నేను బతకలేనని.. ప్రియుడు తన స్నేహితురాలికి ఫోన్లో లేదా కలిసినప్పుడు చెబుతుంటారట. అబద్దాలు చెప్పడం ద్వారా పురుషులు తరచూ తమ భాగస్వామి నమ్మకాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నిస్తారట. పురుషులు పెళ్లికి ముందు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి తమ వద్ద చాలా డబ్బు ఉందని అబద్ధం చెబుతారంట. ఆ సమయంలో పెళ్లి జరిగిన పురుషులు డబ్బు ఉన్నప్పటికీ డబ్బు లేదని తన భార్యకు తరచూ అబద్ధాలు చెబుతారట. ముఖ్యంగా అబ్బాయిలు తమ స్నేహితురాలు లేదా భార్యతో తాము ఒక్కసారి మాత్రమే ప్రేమలో పడ్డామని.. అది కూడా తమతో అని అబద్ధం చెబుతారట. అబ్బాయిలు తమ గత స్నేహితురాళ్ల గురించి అస్సలు చెప్పరు. ఎందుకంటే వారి బంధం బలహీనం చెందుతుందని భావిస్తారట.
Also Read :
మీరు రిలేషన్షిప్లో ఉన్నారా..? అయితే ఈ 6 విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!