Home » మీరు రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారా..? అయితే ఈ 6 విష‌యాల‌ను త‌ప్ప‌కుండా తెలుసుకోండి..!

మీరు రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారా..? అయితే ఈ 6 విష‌యాల‌ను త‌ప్ప‌కుండా తెలుసుకోండి..!

by Anji

ఒక సంబంధం నాలుగు కాలాల పాటు దృఢంగా ఉండాలంటే ఒక‌రికి ఒక‌రు త‌మ అభిప్రాయాల‌ను గౌర‌వించుకోవాలి. రిలేష‌న్ షిప్‌లో ఉన్న ఒక వ్యక్తి త‌న విభిన్న ఆలోచ‌న‌లు, భావాలు కోరిక‌ల‌ను ఏ భ‌యం లేకుండా త‌న భాగ‌స్వామికి తెలపాలి. విభిన్నంగా ఉండే ఆ ఆలోచ‌న‌ల‌ను భాగ‌స్వామి స‌హించాలి. విభేదాల‌ను లేదా డిఫ‌రెంట్ ఒపినియ‌న్స్ భాగ‌స్వామికి స‌హించే సామ‌ర్థ్యం ఉంటేనే ఆ బంధం ఎప్ప‌టికీ విడిపోదు. భాగ‌స్వాములు త‌మ మ‌ధ్య క‌మ్యూనికేష‌న్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. లేదంటే ఆ బంధం తెగిపోవ‌డానికి కార‌ణం అవుతుంది. కొన్ని విష‌యాల్లో అప్పుడ‌ప్పుడు ఏకీభ‌వించ‌కుండా చిన్న‌పాటి గొడ‌వ‌లు పెట్టుకోవడం మంచిదే. కానీ ఆ గొడ‌వ‌లు మ‌ళ్లీ వెంట‌నే క‌లిసిపోయే అంత చిన్న‌గా ఉండాలి.ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు అనేవి తీవ్రంగా ఉంటే అది బంధంపై పెద్ద ప్ర‌భావం చూప‌వచ్చు. ఒక రిలేష‌న్ లో భాగ‌స్వామికి భిన్నంగా ఉంటూ సొంత అభిప్రాయాల‌ను ఎలా వ్య‌క్త‌ప‌ర‌చాలి. బంధాన్ని మ‌రింత ధృఢంగా ఎలా మార్చుకోవాలి అనేది ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

మీరు మీ స‌మ‌స్య‌ల‌ను మా భాగ‌స్వామికి తెలియ‌జేయ‌డానికి ముందు ఆ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించ‌డం మీ భాగ‌స్వామికి ఎలా అనిపిస్తుందో అర్థం చేసుకోవాలి. ఈ స‌మ‌స్య చిన్న‌త‌నంలో మీరు చ‌విచూసిన ఒక చేదు అనుభ‌వం కావ‌చ్చు. మ‌రేదైనా స‌మ‌స్య కావచ్చు. స‌మ‌స్య ఏదైనా స‌రే మీ భాగ‌స్వామి ఆ స‌మ‌స్య విన్న త‌రువాత మీకు స‌పోర్టుగా నిలుస్తారా లేక మీతో మాట్లాడ‌డ‌మే మానేస్తారా అనేది అంచ‌నా వేసుకొని ఆ త‌రువాత‌నే ఆస‌మ‌స్య‌ల‌ను వ్య‌క్త ప‌రచాలి. క్లిష్ట ప‌రిస్థితుల్లో భాగ‌స్వామికి అండ‌గా మేమున్నామ‌నే భావ‌న క‌లిగించాలి. అదేవిధంగా వారికి కూడా ఒక గుర్తింపు ఉంద‌ని ఫీల‌య్యేలా ప్రోత్స‌హించాలి. వారు ర‌క‌ర‌కాల ఎమోష‌న్స్ అనుభ‌వించ‌వ‌చ్చు.


వాటిని మీరు గుర్తించిన‌ట్టు వారికి అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డం మంచిది. దీని ద్వారా వారు త‌మ భావాల‌ను వ్య‌క్తీక‌రించ‌డానికి భ‌య‌ప‌డ‌రు. అదేవిధంగా ధైర్యంగా వారు మీతో అన్ని పంచుకోగ‌లుగుతారు. చాలా మంది ప్ర‌జ‌లు కొన్నిసార్లు మ‌న భాగ‌స్వాముల‌పై మాన‌సికంగా ఆధార‌ప‌డ‌తారు. ఇలా ఎమోష‌న‌ల్ ఆధార‌ప‌డితే చివ‌రికీ ఆ అల‌వాటు అనేది మీకు చాలా చెడు చేయ‌వ‌చ్చు. ఎమోష‌న‌ల్ గా మ‌నం బుజ్జ‌గించుకోవ‌డం నేర్చుకోవాలి. రిలేష‌న్ షిప్‌లో క్లారిటీగా ఉండ‌వ‌చ్చు. త‌గిన‌న్ని ప్ర‌శ్న‌లు అడ‌గ‌కపోతే భాగ‌స్వామి ఏమ‌నుకుంటున్నారనేది అస్స‌లు అర్థం కాదు. మ‌న‌స్సులో ఏవేవో ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి. ఎక్కువ‌గా ఆలోచిస్తే ఆందోళ‌న‌, ఒత్తిడి త‌లెత్తుతాయి. ఈ స‌మ‌స్య‌లు రాకుండా అడ‌గాల‌నుకున్న ప్ర‌శ్న‌ల‌ను వెంట‌నే అడ‌గడం ఉత్త‌మం. మీ భాగ‌స్వామి ఆలోచ‌న విధానాన్ని అర్థం చేసుకుని దానిని గౌర‌వించ‌డం చాలా ముఖ్యం. అదే స‌మ‌యంలో మీరు మీ సొంత ఆలోచ‌న విధానాన్ని క‌లిగి ఉండాలి. అప్పుడే మీ అనుబంధం ప‌ది కాలాల పాటు ప‌దిలంగా ఉంటుంది.

Also Read : 

పూజాకు సూపర్ హిట్ మిస్ చేసిన కరోనా..!

అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తే ఏం చేయ‌వ‌చ్చంటే..?

 

Visitors Are Also Reading