టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు దాదాపు రెండున్నరేళ్ల తరువాత హీరోగా నటించిన మూవీ సర్కారు వారి పాట. ఈ చిత్రం మరికొద్ది గంటల్లోనే విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
మహేష్ బాబు ఆయన తన సినిమా ఓపెనింగ్స్‌కు అసలు రాడు. ఎందుకంటే హీరో తన కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఒకటి రెండు చిత్రాల పూజా కార్యక్రమాలకు హాజరైతే.. అవి అంతగా హిట్ కాలేదు. ఆ తరువాత తన సినిమా ఓపెనింగ్స్‌కు రావడం లేదు. చాలా సంవత్సరాల నుంచి మహేష్ బాబుకు అది ఓ సెంటిమెంట్. తన భార్య నమ్రత మాత్రమే కొత్త సినిమా పూజా కార్యక్రమాలకు హాజరవుతుంది. త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్‌కు కూడా నమ్రత హాజరయ్యారు. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా విషయంలో మాత్రం మహేష్ అభిమానులను కాస్త కంగారుపెడుతున్నాడు. ఈ సినిమా మే 12 అనగా రేపే విడుదల కానున్నది. ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో ఆనందం కంటే టెన్షన్ ఎక్కువగా కనిపిస్తుంది.
ముఖ్యంగా మే నెల బ్యాడ్ సెంటిమెంట్. మహేష్ బాబు కెరీర్‌లో మే నెల అంతగా కలిసి రాలేదు. ఆ నెలలో వచ్చిన కొన్ని సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. మే అంటే భయపడుతుంటారు అభిమానులు. 2003 మే 23న మహేష్ బాబు నిజం సినిమా విడుదలైంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఉత్తమ నటుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు. సినిమా ఫలితం మాత్రం ఫ్లాప్. ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత భారీ అంచనాలతో వచ్చిన నిజం అంచనాలను అందుకోలేదు.
Advertisement
2004 మే 14న విడుదలైన నాని కూడా ఫ్లాప్ అయింది. ఖుషి లాంటి సంచలన విజయం తరువాత దర్శకుడు ఎస్.జే. సూర్య తెలుగులో తెరకెక్కించిన రెండవ సినిమా నాని. ఈ సినిమాతో మహేష్ బాబు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ విజయం సాధించలేకపోయాడు.
ఇక 2016 మే 20 విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా ఎంత దారుణంగా నిరాశ పరిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి గాలికి కొట్టుకుపోయిందనే చెప్పవచ్చు. మహేస్ కెరీర్‌లోనే ఇంతకంటే దారుణమైన డిజాస్టర్ మరొకటి లేదట. ఇక ఈ మూడు సినిమాలు కూడా మే నెలలోనే రావడం విశేషం.
మహేష్ బాబు అభిమానులకు మే అంటే అంత భయం. అయితే వాళ్లకు ఊరటనిచ్చే ఒకే ఒక అంశం ఏమిటంటే.. మహర్షి సినిమా కూడా మే నెలలోనే విడుదల కావడం విశేషం. 2019 మే 09 విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. సూపర్ స్టార్ 25వ సినిమాగా వచ్చిన మహర్షి రూ.100 కోట్లకు పైగా వసూలు కూడా చేయడం విశేషం. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు.
ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాను మే 12న విడుదలవుతోంది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ.120 కోట్లు బిజినెస్ చేసింది. అచ్చి రాని మే నెలలో వస్తున్న సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఎలా ఉండబోతుందో చూడాలి మరి. మహర్షిలా ఈ సినిమా హిట్ అందుకుంటుందా లేక నిజం, నాని, బ్రహ్మోత్సవం మాదిరిగా ఫ్లాప్ అవుతుందా అనేది తెలియాలంటే రేపటివరకు ఎదురుచూడాల్సిందే.
Also Read :
ప్రభాస్, అనుష్క తో పాటు ఆ సెలబ్రిటీలకు పెళ్లి గండం….వేణు స్వామి సంచలన జ్యోతిష్యం…!
అల్లుఅర్జున్ వరుడు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ప్రస్తుతం ఏం చేస్తుందంటే..?