Home » శ్రీరాముడి పట్టాభిషేకానికి మేము వచ్చేది లేదు అంటూ తిరస్కరించిన నేతలు వీళ్ళే !

శ్రీరాముడి పట్టాభిషేకానికి మేము వచ్చేది లేదు అంటూ తిరస్కరించిన నేతలు వీళ్ళే !

by Anji
Ad

అయోధ్య రామ మందిర గర్భ గుడిలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మరికొద్ది సేపట్లోనే జరుగనుంది. ఈ కార్యక్రమంతో  కోట్లాది మంది హిందువుల కల తీరనుంది. ఇదే సమయంలో చాలా మంది నేతలు అయోధ్యకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. మరోవైపు ఇండియా కూటమి నేతలు మాత్రం అయోధ్య వెళ్లమని చెబుతున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే వంటి కాంగ్రెస్ నేతల మాటనే కాదు.. మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఇలా కొంత మంది ఇదే బాటలో పయణిస్తున్నారు. ఎందుకు అంటే.. ఇది బీజేపీ పండుగ అంట.. అంతా రాజకీయమట అనేది వాళ్ల ఆరోపణ. అందుకే బాయ్ కాట్ అంటున్నారు ఇండియా కూటమి నేతలు.

rammandir-ayodya

Advertisement

 

అయోధ్యలో రాములోరి ప్రాణ ప్రతిష్టతను దేశమంతా పెద్ద పండుగలా జరుపుకుంటోంది. పాలిటిక్స్ లో మాత్రం విబేదాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని సోనియగాంధీ, మల్లి ఖార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరికి ఆహ్వానాలు అందాయి. కానీ అయోధ్య పేరుతో బీజేపీ-ఆర్ఎస్ఎస్ రాజకీయాలు చేసాయని.. కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రధానంగా లోక్ సభ ఎన్నికల ముందు రాజకీయ లబ్ది కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని.. రామాలయ నిర్మాణం పూర్తి కాలేదని.. మంత అనేది వ్యక్తి గత అంశం అని కాంగ్రెస్ చెబుతోంది.

Advertisement

రామమందిరం ప్రారంభోత్సవం పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవలే స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన రాజకీయ కార్యక్రమం.. ఓట్ల కోసమే అని.. బీజేపీ-ఆర్ఎస్ఎస్ చేస్తున్న పొలిటికల్ ఫంక్షన్ దానికి తాము హాజరు కావడం లేదన్నారు. తమ పార్టీ నేతలు అయోధ్యకు వెళ్తే అభ్యంతరం చెప్పబోమన్నారు. మరోవైపు మరాఠా స్ట్రాంగ్ మేన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదు. ఇక ఎస్పీ అధినేత అఖిలేష్, ఆర్జేడీ నేతలు లాలూ, తేజస్వీలు కూడా రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావడం లేదు.  అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను దేశం మొత్తం పండుగలా జరుపుకుంటే.. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు బాయ్ కాట్ చేయడం.. ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం గా మారింది.

 

Visitors Are Also Reading