టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణగారి చిన్నబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వాస్తవానికి మహేష్ బాబుని హీరోని చేయాలనే ఉద్దేశం తొలుత కృష్ణకి లేదు. పెద్దబ్బాయి రమేష్ బాబునే హీరోగా చేద్దామనుకున్నారు. మహేష్ బాబు పెద్ద బిజినెస్‌మెన్‌గా రాణిస్తాడని ఆయనకు ఓ జ్యోతిష్యుడు చెప్పాడట. కృష్ణ జీవితంలో ఆ జ్యోతిష్యుడు చెప్పిన చాలా విషయాలు నెరవేరాయి. అందుకే తన పద్మాలయ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించబోయే సినిమాల పనులను మహేష్ చేతిలో పెట్టాలని ఆయన తొలుత భావించారు. మహేష్ విషయంలో కృష్ణ ఆలోచనలు తలకిందులయ్యాయి. పెద్దబ్బాయి రమేష్ బాబు పెద్దగా క్లిక్ అవ్వలేదు.
Advertisement
మహేష్‌ను హీరోగా లాంచ్ చేయాల్సి వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 9 సినిమాల్లో నటించిన మహేష్, కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన రాజకుమారుడు చిత్రంలో హీరోగా పరిచయమయ్యాడు. వాస్తవానికి కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలి.కానీ కొన్ని కారణాల వల్ల రాఘవేంద్రరావు చేతిలో పడ్డాడు మహేష్. ఆ తరువాత ఒక్కోమెట్టు ఎక్కుతూ ఇప్పుడు సూపర్‌స్టార్‌గా నిలబడ్డాడు. ముఖ్యంగా మహేష్ బాబు కెరీర్‌లో పోకిరి సినిమా ఇండస్ట్రీ రికార్డు తిరగరాసింది. అప్పటివరకు ఉన్న సినీ రికార్డులను బ్రేక్ చేసింది. పోకిరి తరువాత పూరిజగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కింది. ఆ సినిమానే బిజినెస్‌మెన్. ఆ సినిమా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Also Read : “మగధీర” సినిమా స్టోరీని రచయిత ఆ సినిమా కథ నుండి తీసుకున్నాడా..? ఆ సినిమా ఏదంటే..?
బిజినెస్ మెన్ సినిమాను ఒక రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తీశారు. 1960లో తమిళనాడు నుంచి ముంబయికి వెళ్లే ఒక పర్సన్ గ్యాంగ్ స్టర్ అయ్యాడు. రక్తచరిత్ర సినిమా తరువాత ఈ కాన్సెప్ట్ ఆర్‌జీవీ గారు సూర్య హీరో అండ్ పూరిజగన్నాథ్ దర్శకునిగా ఒక మల్టీలింగ్వల్ సినిమా తీయాలని ప్లాన్ వేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎంతకి ఫైనల్ కాకపోవడంతో నిర్మాత ఆర్.ఆర్.వెంకట్ ఇదే లైన్‌మీద పోకిరి కాంబినేషన్‌తో మూవీ చేయాలని అనుకున్నారు. మహేష్ బాబు దూకుడు సినిమా డబ్బింగ్‌లో ఉన్న సమయంలో ఈ బిజినెస్‌మెన్ స్టోరీ ఇనిషియల్ డ్రాప్ట్ పంపారంట పూరిజగన్నాథ్. కొన్ని రోజులకు మూవీ చేద్దామని ఆన్సర్ రావడంతో దర్శకుడు పూరి జగన్నాథ్ బ్యాంకాకు వెళ్లి పక్కాగా ఫుల్ స్క్రిప్ట్ రాసుకొని వచ్చారు. ముందుగా ఎంటర్ స్క్రిప్ట్ వినకపోవడం వల్ల మహేష్ బాబు సెట్స్‌లో ఏ రోజుకు ఆరోజు సీన్స్ అండ్ డైలాగ్‌లు చెప్పించుకొని ఆన్ ద స్పాట్‌లో యాక్ట్ చేశారు. ఇంకా అవన్నీ సింగిల్ టేక్‌లోనే అయిపోతుండేవట. సో అలా ఫైనల్‌గా జస్ట్ 74 డేస్‌లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమా 2012 జనవరి 13న సంక్రాంతికి విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది.
Also Read : వేదం సినిమాలో కర్పూరం పాత్రలో తొలుత చేయాల్సింది ఎవరో తెలుసా ?