Telugu News » Blog » వేదం సినిమాలో క‌ర్పూరం పాత్ర‌లో తొలుత చేయాల్సింది ఎవ‌రో తెలుసా ?

వేదం సినిమాలో క‌ర్పూరం పాత్ర‌లో తొలుత చేయాల్సింది ఎవ‌రో తెలుసా ?

by Anji
Ads

సాధార‌ణంగా న‌టుడు అంటే ప్ర‌తీ పాత్ర చేస్తుంటాడు. ముఖ్యంగా పూర్వ‌కాలంలో అయితే హీరోలు, విల‌న్లు అనే తేడా ఎన్టీఆర్‌, ఏఎన్నార్ వీరు పాత్ర‌ల‌కే ప్రాధ‌న్య‌మిస్తూ న‌టించేవారు. ప్ర‌తీ న‌టుడిని ఏ పాత్ర అయితే సూట్ అవుతుందో అది చేస్తుంటారు. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు కూడా అంత‌కు ముందు ఉన్న త‌మ ఇమేజ్‌ని ప‌క్క‌కు పెట్టి ప్ర‌యోగాత్మ‌క సినిమాల‌ను చేశారు. కేవ‌లం హీరోలు మాత్ర‌మే కాదు. ద‌ర్శ‌కులు కూడా వారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌లు సినిమాల్లో ఇప్ప‌టికే న‌టించారు. ముందు ముందు కూడా న‌టిస్తార‌న‌డంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి సై, బాహుబ‌లి వంటి సినిమాల్లో న‌టించిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజాగా పూరి జ‌గ‌న్నాథ్ మెగాస్టార్ చిరంజీవి న‌టించిన గాడ్‌ఫాద‌ర్ సినిమాలో న‌టించారు. . రాఘ‌వ లారెన్స్ గురించి అయితే ఇక చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న ఎన్నో సినిమాల్లో న‌టించాడు. ఇక‌ ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల మూడి కూడా రెండు చిత్రాల్లో న‌టించారు. ఆ విష‌యం చాలా త‌క్కువ మందికే తెలుసు. ముఖ్యంగా ద‌ర్శ‌కులు కేవ‌లం ద‌ర్శ‌కులే కాకుండా ప‌లు సినిమాల్లో న‌టించారు అన‌డానికి ఇదే ఉదాహ‌ర‌ణ‌. ముఖ్య‌గా అల్లు అర్జున్ న‌టించిన వేదం చిత్రం అద్భుత‌మైన ప్ర‌యోగ‌చిత్ర‌మనే చెప్పాలి. ఈ సినిమా సాధార‌ణ వ్య‌క్తులు ఎదుర్కునే స‌మ‌స్య‌ల చుట్టూనే తిరుగుతుంటుంది. ఈ చిత్రానికి క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.


అల్లు అర్జున్ వేదం సినిమాలో కేబుల్ రాజుగా పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. అదేవిధంగా అనుష్క న‌టించిన స‌రోజ పాత్ర కూడా మంచి పేరు వ‌చ్చింది. ఇక మ‌రో హీరో మంచు మ‌నోజ్ కూడా న‌టించారు. ఈ సినిమా ఫ‌లితం ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఇందులో న‌టించిన వారి న‌ట‌న‌ని, ఇలాంటి క‌థ‌ను ఎంచుకున్న ద‌ర్శ‌కుడు క్రిష్‌ని ప్ర‌శంసించారు. ఈ సినిమాలో అనుష్క ప‌క్క‌న మ‌రో వ్య‌క్తి కూడా ఉంటాడు. త‌నే క‌ర్పూరం. స‌రోజ వేరే ఊరికి వెళ్లి ఇవ‌న్నీ వ‌దిలేసి వేరే జీవితం చూసుకుందాం అని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు క‌ర్పూరం స‌రోజ‌కు మ‌ద్ద‌తు ఇస్తుంది.

Advertisement

Also Read :  గాడ్ ఫాదర్ లోని ఆ డైలాగ్ ను చిరంజీవి వైసీపీని ఉద్దేశించి చెప్పారా ..? ఇదిగో క్లారిటీ…!

 

అయితే ఈ చిత్రంలో క‌ర్పూరం పాత్ర పోషించిన వ్య‌క్తి పేరు నిక్కి.. ఇత‌ను హీరోయిన్ అనుష్క ప‌ర్స‌న‌ల్ మేక‌ప్ స్టాఫ్‌. వాస్త‌వానికి ఈ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు క్రిష్ చేయాలి. కానీ క్రిష్ వాళ్ల త‌ల్లి ఈ పాత్ర చేయ‌డానికి ఒప్పుకోలేదట‌. ఆ పాత్ర చేస్తే పెళ్లి కాద‌ని చెప్పింద‌ట‌. దీంతో ఆ స‌మ‌యంలో అనుష్క నిక్కి పేరు స‌జెస్ట్ చేసింద‌ట‌. అదేవిధంగా నిక్కి చేసిన ఒక డ్యాన్స్ వీడియో కూడా క్రిష్‌కి చూపించారు. ఆ వీడియో చూసి ఈ పాత్ర‌కి నిక్కిని ఎంపిక చేశారు. క్రిష్ వేదం సినిమాలో ఆ పాత్ర చేయ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. మ‌రో పాత్ర అయిన‌టువంటి సాధువుగా చేశారు.

Also Read :  GHOST MOVIE REVIEW: ఘోస్ట్ సినిమా రివ్యూ… మన్మథుడు యాక్షన్ థ్రిల్లర్ తో మెప్పించాడా..?


ఇక వేదం సినిమా కంటే ముందే వ‌చ్చిన గ‌మ్యం సినిమాలో న‌క్స‌లైట్‌గా క‌నిపించారు. గ‌మ్యం సినిమాలో క్రిష్ పోషించిన న‌క్సైల‌ట్ పాత్ర కోసం టాలీవుడ్‌కి చెందిన కొంత‌మందిని అడిగార‌ట‌. అప్ప‌టికే అంద‌రూ బిజీగా ఉండ‌డంతో ఫైట్ మాస్ట‌ర్స్ రామ్‌, ల‌క్ష్మ‌ణ్ క్రిష్‌ని మీరే చేయండి అని సూచించార‌ట‌. దీంతో త‌న ఫేవ‌రేట్ అయిన చెగువేరా గెట‌ప్‌లో స్టైలిష్‌గా హెయిర్ స్టైల్ మార్చుకుని క్రిష్ న‌క్సైలైట్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు. మొత్తానికి ద‌ర్శ‌కుడు క్రిష్ న‌టించాల్సిన క‌ర్పూరం పాత్ర‌ను అలా వ‌దిలేసుకోవాల్సి వ‌చ్చింద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించ‌డం విశేషం.

Advertisement

Also Read :  GOD FATHER MOVIE REVIEW: గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ…ఆచార్య తరవాత చిరు కు హిట్ పడిందా…?