Home » వెండితెరకు వెంకటేష్ పరిచయం చేసిన హీరోయిన్లు వీరే..!

వెండితెరకు వెంకటేష్ పరిచయం చేసిన హీరోయిన్లు వీరే..!

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాప్ హీరోల్లో వెంకటేష్ ఒకరు. ఈయన ఎన్నో సినిమాల్లో విజయాలను సాధిస్తూ.. విక్టరీ వెంకటేష్ గా పేరొందిన ఈ స్టార్ హీరో ఇటీవలే నారప్ప సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. వెంకటేష్ చాలా విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ, మొదటి నుంచి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అంతేకాదు.. కొత్త నటీ మనలను వెండితెరకు హీరోయిన్లుగా పరిచయం చేశాడు. వెంకటేష్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత స్టార్ హీరోయిన్లుగా మారిన వారెవరో ఇప్పుడు మనం  తెలుసుకుందాం.

Advertisement

1. ఆర్తి అగర్వాల్ :

రొ**మాంటిక్ కామెడీ ఫీల్మ్ నువ్వు నాకు నచ్చావ్ తో ఆర్తి అగర్వాల్ ను వెంకీ హీరోయిన్ గా పరిచయం చేశాడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి కథ అందించాడు. ఈ చిత్రాన్ని కె. విజయభాస్కర్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా తర్వాత ఆర్తి ఏ రేంజ్ కి వెళ్ళిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

2. ఫరా :

ఎస్. ఎస్ రవిచంద్రన్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన విజేత విక్రమ్ సినిమాతో ఫరా నాజ్ హష్మీ సుపరిచితమైనది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో 1980-1990 కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది.ఈమె టబు అక్క.

3. ఖుష్బూ :

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన కలియుగ పాండవులు సినిమాతో ఖుష్బూ వెండితెరకు పరిచయమైంది.

4. రూపిణి :

1989లో నా వెంకీ మూవీ ఒంటరి పోరాటంతో రూపిణి సినిమా డెబ్యూ ఇచ్చింది.

5.దివ్యభారతి :


బొబ్బిలి రాజా మూవీతో స్టార్ హీరోయిన్ దివ్య భారతి సినీ అభిమానులకు సుపరిచితురాలైంది.

6. టబూ :


కూలీ నెం.1 సినిమాతో టబూ సిల్వర్ స్క్రీన్ పై తొలిసారిగా కనిపించింది.

7.అపర్ణ :


రొ**మాంటిక్ కామెడీ ఫిలిం సుందరకాండ సినిమాతో అపర్ణ నటిగా పలకరించింది.

8. ప్రేమ :


యాక్షన్ థ్రిల్లర్ ధర్మచక్రం మూవీతో హీరోయిన్ ప్రేమ ఎంట్రీ ఇచ్చింది.

9.శిల్ప శెట్టి :


సాహస వీరుడు సాగర కన్య తో శిల్ప శెట్టి సినీ అభిమానులకు హాయ్ చెప్పింది.

Advertisement

10. అంజలి ఝావేరి :


అప్పట్లో చాలా మంది ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్ గా ఉన్న అంజలి ఝవేరిని కూడా వెంకటేష్ పరిచయం చేశాడు.ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమంటే ఇదేరా తో ప్రీతి జింతా, మల్లేశ్వరితో కత్రినా, గురుతో రితికా సింగ్, లక్ష్మీతో నయనతార ఇలా చాలా మంది వెంకటేష్ సినిమాల్లో హీరోయిన్లుగా   పరిచయమయ్యారు. మొత్తానికి ఇంత మంది హీరోయిన్లను పరిచయం చేసిన ఘనత వెంకటేష్ కి దక్కిందనే చెప్పవచ్చు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading