Home » టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి కనుమరుగైన హీరోలు వీరే..!

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి కనుమరుగైన హీరోలు వీరే..!

by Anji
Ad

సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఉన్నటువంటి పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా పరిశ్రమలో వారసత్వంగా హీరోలు మరికొంత మంది కష్టపడి పైకి వచ్చారు. మరికొందరూ తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇప్పటి రోజుల్లో చాలా మంది హీరోలు, హీరోయిన్లు మరణించే పాత్రలు ఉన్న క్లైమాక్స్ లకు ఓకే చెప్పడం లేదు. రిస్క్ అని భావించినా కొంతమంది హీరోలు, హీరోయిన్లు ఇలా చనిపోయే పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి.. ఇక ఆ తరువాత కనుమరుగు అయిన టాలీవుడ్ హీరోల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

తరుణ్ :

తరుణ్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. బాలనటుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా అవార్డు అందుకున్నాడు. రాష్ట్ర, జాతీయ అవార్డులతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 2000లో  నువ్వెకావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినీ కెరీర్ ప్రారంభంలో తరుణ్ లవర్ బాయ్ చాలా ఫేమస్. ఇండస్ట్రీలో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. అదేవిధంగా సినీ తారల క్రికెట్ లో కూడా తరుణ్ అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు మాత్రం తరుణ్ ఎక్కడ కనిపించకపోవడం గమనార్హం.

వేణు :

తొట్టెంపూడి వేణు ప్రతీ తెలుగు సినిమా ప్రేక్షకుడికి తెలుసు. వేణు నటన గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హనుమాన్ జంక్షన్ సినిమాలో వేణు అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల 2009లో గోపి గోపిక గోదావరి సినిమా తరువాత సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఎన్టీఆర్ నటించిన దమ్ము మూవీలో మాత్రం అతిథి పాత్రలో కనిపించాడు. ఇటీవలే రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీలో కనిపించాడు. మొత్తానికి వేణు సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నాడనే చెప్పవచ్చు.

Advertisement

ఆకాశ్ :

ఆనందం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్ మంచి పేరు సంపాదించుకున్నాడు. తన కెరీర్ లో పెద్దగా హిట్ సినిమాలు లేకపోయినా అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. గోరింటాకు చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డును గెలుచుకున్నాడు ఆకాశ్.

హీరో రాజా :

హీరో రాజా గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఓ చిన్నదానా మూవీతో ఆరంగేట్రం చేశాడు. ఆనంద్ చిత్రంతో రాజాకి ఇండస్ట్రీలో మంచి హైప్ వచ్చింది. ఆ తరువాత మంచి సినిమాలను ఎంచుకున్నాడు. కానీ చివరికీ రేసు నుంచి తప్పుకున్నాడు.

రాహుల్ :

మనలో చాలా మందికి అతని స్క్రీన్ పేరు. టైసన్ ఇన్ హ్యాడీడేస్ ద్వారా తెలుసు. అతను హ్యాపీడేస్ లోని నలుగురు హీరోలలో ఓ మంచి పాత్రలో నటించారు. టైసన్ పాత్రలో అతని పాత్రకు గొప్ప ప్రశంసలను పొందాడు. ఇక తరువాత కనుమరుగయ్యాడు.

వడ్డె నవీన్ :

కోరుకున్న ప్రియుడు, పెళ్లి వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 1990లో చివరి, 2000 దశకం ప్రారంభంలో ప్రముఖ నటులలో ఒకరు.  నా ఊపిరిలో తన పాత్రకు నంది స్పెషల్ జ్యూరి అవార్డును గెలుచుకున్నాడు. కానీ క్రమ క్రమంగా సినిమాల్లో  కనిపించకుండా పోయాడు.

ఆర్యన్ రాజేష్ 

ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్. హాయ్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఆ తరువాత ఎవడిగోల వాడిదే, ఆడంతే అదోటైపు, నువ్వంటే నాకిష్టం, అనుమానాస్పదం సినిమాలో నటించాడు. ఆ తరువాత సైడ్ క్యారెక్టర్లకే పరిమితమయ్యాడు ఆర్యన్ రాజేష్. 

Visitors Are Also Reading