Home » షార్ట్ ఫిలిమ్స్ చేసి..టాలీవుడ్‌ లో స్టార్లుగా ఎదిగిన హీరోలు, హీరోయిన్లు వీరే !

షార్ట్ ఫిలిమ్స్ చేసి..టాలీవుడ్‌ లో స్టార్లుగా ఎదిగిన హీరోలు, హీరోయిన్లు వీరే !

by Bunty
Ad

కొందరికి సినిమాల్లో నటిస్తే కానీ మంచి గుర్తింపురాదు. కానీ ప్రస్తుత కాలంలో కొంతమంది సెలబ్రిటీలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయ్యి స్టార్ హీరోలు, హీరోయిన్లు అవుతున్నారు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయిన మన సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. అయితే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మన ఇండస్ట్రీకి హీరోలు, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం…

Advertisement

# నవీన్ పోలిశెట్టి

షార్ట్ ఫిలిమ్స్ తో పాటుగా పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలో అదరగొడుతున్నారు. “ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ” సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.

# రీతు చౌదరి

ఈ అమ్మడు కూడా ఒక సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో నటించి పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్గా మనందరికీ పరిచయమైంది.

# వైష్ణవి
సోషల్ మీడియాలో పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పరిచయమైన వైష్ణవి ఇప్పుడు “బేబీ” సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది.

Advertisement

# చాందిని చౌదరి

ఎన్నో రకాలైనటువంటి షార్ట్ ఫిలిమ్స్ లలో నటించినటువంటి చాందిని మను సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ ఆ భామ.

# సుహాస్

షార్ట్ ఫిలిమ్స్ తో పాటుగా పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు పొందినటువంటి సుహాస్ “కలర్ ఫోటో” సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇప్పుడు సూపర్ సక్సెస్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.

 

ఇవి కూడా చదవండి

బ్యాడ్ లక్ అంటే ఇదే… 99 పరుగులు కొట్టి నాటౌట్ గా మిగిలిపోయిన ఆటగాళ్లు వీరే !

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

కావ్య బాధపడుతుంటే చూడలేకపోయా.. సన్‌రైజర్స్ పై రజినీకాంత్‌ సంచలనం

 

Visitors Are Also Reading