Home » బాల‌కృష్ణ న‌టించిన అఖండ సినిమాలో హీరోయిన్ పాత్రను ఈ న‌లుగురు హీరోయిన్స్ రిజెక్ట్ చేసిన విష‌యం మీకు తెలుసా..?

బాల‌కృష్ణ న‌టించిన అఖండ సినిమాలో హీరోయిన్ పాత్రను ఈ న‌లుగురు హీరోయిన్స్ రిజెక్ట్ చేసిన విష‌యం మీకు తెలుసా..?

by Anji
Ad

నంద‌మూరి బాల‌కృష్ణ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. బాల‌కృష్ణ బి.గోపాల్ కాంబోలో అప్ప‌ట్లో సెన్షేష‌న్ హిట్ సినిమాలు ఎలా వ‌చ్చాయో ఇప్పుడు బోయ‌పాటి శ్రీ‌ను-బాల‌య్య కాంబినేష‌న్ లో అంత‌టి ఘ‌న విజ‌యం సాధిస్తున్నాయి. ముఖ్యంగా బాల‌య్య‌-బోయ‌పాటి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేశాయో ఇక ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన అవ‌స‌ర‌మే లేదు. వీరి కాంబినేష‌న్ లో హాట్రిక్ హిట్ అందుకున్నారు.

Advertisement

బాల‌య్య న‌టించిన అఖండ సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ చిత్రంలో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యంతో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ముఖ్యంగా అఖండ‌ విడుద‌లైన 4 రోజుల్లోనే రూ.44 కోట్ల షేర్ వ‌సూలు చేసి బాక్సాఫీస్ వ‌ద్ద బాల‌య్య సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక సినిమాలో ఫ‌స్ట్ హాప్ లో బాల‌య్య ముర‌ళీకృష్ణ పాత్ర‌కు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఉండ‌గా.. సెకండ్ హాఫ్ అఖండ పాత్ర‌కు ప్రాధాన్యం ఇచ్చారు బోయ‌పాటి. అఘోర పాత్ర‌లో బాల‌య్య‌ అద్భుతంగా న‌టించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందారు.

Advertisement


ఫ‌స్ట్ హాఫ్ లో వ‌చ్చే మురళీకృష్ణ పాత్ర‌లో బాల‌య్య‌కు భార్య‌గా ప్ర‌గ్యాజైస్వాల్ న‌టించింది. అయితే ప్ర‌గ్యాజైస్వామ్ కంటే ముందే బోయ‌పాటి ఈ చిత్రంలో న‌టించ‌డానికి బాల‌య్య రేంజ్‌ని దృష్టిలో పెట్టుకొని నలుగురు హీరోయిన్ల‌ను సంప్ర‌దించ‌డం విశేషం. వారిలో తొలుత కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ఆ త‌రువాత ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, కేథ‌రిన్‌, పాయ‌ల్ రాజ్ పుత్ వంటి హీరోయిన్ల‌ను బోయ‌పాటి సంప్ర‌దించార‌ట‌. కానీ ఈ న‌లుగురు హీరోయిన్లు బాల‌కృష్ణ‌తో న‌టించడానికి నో చెప్పార‌ట‌. దీంతో బాల‌య్య‌తో న‌టించే ఛాన్స్ ప్ర‌గ్యాజైస్వాల్ ద‌క్కించుకుంది. ఇక అఖండ సినిమా అఖండ విజ‌యం సాధించ‌డంతో ప్ర‌గ్యాజైస్వాల్ కి కూడా మంచి పేరు వ‌చ్చింద‌నే చెప్పాలి. అయినా కానీ ప్ర‌స్తుతం ప్ర‌గ్యాజైస్వాల్ కి ఆప‌ర్లు మాత్రం రావ‌డం లేద‌ట‌. రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ మంచి ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంటుందో లేదో వేచి చూడాలి.

Also Read :   Jr NTR: ఆస్కార్ బ‌రిలో ఎన్టీఆర్.. హాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..!

తెలంగాణ‌లో ఉన్న మ‌హాత్ముడి గుడి గురించి మీకు తెలుసా..?

Visitors Are Also Reading