Telugu News » Blog » Jr NTR: ఆస్కార్ బ‌రిలో ఎన్టీఆర్.. హాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..!

Jr NTR: ఆస్కార్ బ‌రిలో ఎన్టీఆర్.. హాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..!

by Anji
Published: Last Updated on

నంద‌మూరి తార‌క రామారావు ఈ పేరు వింటేనే తెలుగు ప్ర‌జ‌ల్లో ఓ వైబ్రేష‌న్ వ‌స్తుంది. సినిమాల్లో కానీ, రాజ‌కీయాల్లో సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌న‌దైన స్టైల్ లో రాణించారు. ఇప్పుడు ఆయ‌న పేరుతో పాటు న‌ట‌న‌ను కూడా పుణికిపుచ్చుకున్న తాత పేరు నిల‌బెడుతున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్.

Ads

తెలుగు తెర‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న‌దైన ముద్ర‌వేసి అంతులేని అభిమానుల‌ను సంపాదించుకున్నారు. న‌ట‌న‌, డ్యాన్స్, డైలాగ్స్ ఇలా ఎందులోనైనా తార‌క్ త‌రువాతే ఎవ‌రైనా అనేలా ప్రేక్ష‌కుల చేత జేజేలు కొట్టించుకున్నారు.


మాస్ సినిమాల్లో అయితే ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోవాల్సిందే. త‌న డైలాగ్‌ల‌తో బాక్సాపీస్ బ‌ద్ద‌లు కావాల్సిందే. ప‌వ‌ర్ పుల్ డైలాగ్ చెప్పాలంటే బాల‌య్య త‌రువాత ఎన్టీఆర్ కే సాధ్యం. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు మ‌న తార‌క రాముడు. ఎన్టీఆర్ న‌ట‌న గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఏ పాత్ర‌లోనైనా ఇట్టే ఒదిగిపోతాడు. తాజాగా ఎన్టీఆర్ పేరు హాలీవుడ్‌లో మారుమ్రోగిపోతుంది. ఎన్టీఆర్ ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్ర‌లో న‌టించారు.

Ads

కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. కొమురం భీమ్ పాత్ర‌లోని అన్ని ఎమోష‌న్స్ ని తార‌క్ అద్భుతంగా ప‌లికించారు. ఈసినిమా దేశ‌వ్యాప్తంగానే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ ల‌వ‌ర్స్ ని ఆక‌ట్టుకుంది. తాజాగా హాలీవుడ్ కి చెందిన వెరైటీ అనే మ్యాగజైన్ తార‌క్ గురించి ప్ర‌స్తావించింది. తార‌క్ న‌ట‌న‌కు ఆస్కార్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆ మ్యాగ‌జైన్ రాసుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న‌కు ఆస్కార్ అవార్డు ఇచ్చిన త‌ప్పులేద‌ని అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఈసారి ఆస్కార్ బ‌రిలో ఎన్టీఆర్ ని ఉత్త‌మ న‌టుడు కేట‌గిరిలో ఎంపిక చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇక ఈ వార్త నిజంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాల‌ర్ ఎగుర‌వేసే వార్త అనే చెప్ప‌వ‌చ్చు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి ఆస్కార్ కి ఎంపికైన తొలి హీరో ఎన్టీఆర్ అవుతాడు. ఇది నిజంగా గ‌ర్వ‌కార‌ణ‌మ‌నే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమా లేదా ఎన్టీఆర్ ఆస్కార్ కి నామినేట్ అవుతాలో లేదో కొద్ది రోజులు ఎదురు చూడాలి మ‌రి.

Also Read : 

మ‌హేశ్ బాబు రిజెక్ట్ చేసిన క‌థ‌తో నాగ‌చైత‌న్య స్టార్ అయ్యాడు…? ఆ సినిమా ఏదో తెలుసా..?

“ఎఫ్ -3” సినిమా ఓ స్టుప్పిడ్ కథ…దీనికంటే ఆ సినిమా బెటర్ అంటూ పరుచూరి సంచలన వ్యాఖ్యలు…!