కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆమె దర్శకుడు తేజ తెరకెక్కించిన లక్ష్మీకళ్యాణం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకీ పరిచయమైంది. ఇక ఆ తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమా కూడా హిట్ కావడంతో కాజల్ క్రేజ్ పెరిగింది. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా ద్వారా ఆమె క్రేజ్ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. తన కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగానే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు నీల్ అనే ఒక మగబిడ్డ కలడు. ఇదిలా ఉంటే.. కాజల్ తన సినీ కెరీర్ లో ఇప్పటి వరకు రిజెక్ట్ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
అలివేలు మంగ వెంకట రమణ :
కాజల్ అగర్వాల్ ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు తేజ. ఆయన ఎప్పుడు ఏ సినిమా అడిగినా కూడా ఆమె మాత్రం నో చెప్పదు. కానీ ఫ్లాప్‌ల్లో ఉన్న తేజను నమ్మి తనకంటే క్రేజ్ లో తక్కువ అయిన రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించింది కాజల్. వెంటనే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన సీత సినిమాలో కూడా నటించిది. కానీ అలివేలు వెంకట రమణ సినిమాను తేజ ఆ మధ్య అనౌన్స్ చేశాడు. గోపిచంద్ హీరోగా నటించబోయే ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కాజల్ మాత్రం ఈ చిత్రాన్ని ఒప్పుకోలేదు. తాప్సీనీ తీసుకున్నాడు దర్శకుడు తేజ.
సాహో :
ప్రభాస్‌తో కాజల్ అదిరిపోయే కాంబినేషన్ అనే చెప్పాలి. వీరి కాంబోలో వచ్చిన డార్లింగ్, మిస్టర్ ఫర్‌పెక్ట్ సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. వరుసగా ఈ రెండు సినిమాలు కలిసి చేశారు ప్రభాస్, కాజల్. ఈ కాంబోలో రిపీట్ చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. కానీ అది కుదరలేదు. ఇక దర్శకుడు లారెన్స్ కూడా రెబల్ సినిమా కోసం కాజల్ ని అడిగారట అది కూడా కుదరలేదు. 2019లో వచ్చిన సాహో సినిమాలో జాక్వలిన్ చేసిన ఐటమ్ సాంగ్ కోసం తొలుత కాజల్ నే సంప్రదించారట. అందుకు ఆమె నో చెప్పిందట.
తేజ- కాజల్ సినిమా :
సాధారణంగా టాప్ హీరోలతో నటించే అవకాశం వస్తే మాత్రం ఎవ్వరూ వదులుకోరు. కాజల్ మాత్రం అందుకు డిఫరెంట్ అనే చెప్పాలి. వెంకటేష్ లాంటి హీరోతో నటించే అవకాశం వచ్చినప్పుడు కాదనేసింది. అప్పట్లో తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించాలనుకున్నారు. తొలుత హీరోయిన్ గా కాజల్ నే ఎంపిక చేయాలనుకున్నారు. తొలుత ఒప్పుకున్న తరువాత సినిమా నుంచి అనుకోని కారణాలతో కాజల్ తప్పుకుంది. ఇక విచిత్రమేమిటంటే ఈ చిత్రం కూడా ఆ తరువాత ఆగిపోవడం విశేషం.
తూంగావనం :
కమల్ హాసన్ తో ఇప్పుడు ఇండియన్ 2 సినిమాలో నటిస్తుంది కాజల్ అగర్వాల్. దానికి ముందే ఓ సినిమాలో నటించడానికి నో చెప్పింది. కమల్ హాసన్ హీరోగా తూంగావనం అనే సినిమా వచ్చింది. ఇందులో నటించడానికి కాజల్ కి ఆఫర్ వచ్చిందట. అందులో నటించడానికి ఆమె ఒప్పుకోలేదు. డబుల్ రెమ్యునరేషన్ అడిగిందనే వార్తలు కూడా వినిపించాయి. అప్పటి కాంబినేషన్ మిస్ అయినా కూడా అడిగిందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇండియన్ 2లో కమల్ హాసన్, కాజల్ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతానికి ఆగిపోయిందనే చెప్పాలి.
Advertisement
ఉదయనిధి స్టాలిన్ :
తమిళంలోనే ఎక్కువ సినిమాలకు నో చెప్పింది కాజల్. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో అక్కడ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి చందమామకి సమయం సరిపోలేదు. ఇక ఆచార్య సినిమా ఒప్పుకున్న తరువాత తమిళంలో ఉదయనిది స్టాలిన్ సినిమాలో నటించడానికి ఆఫర్ వచ్చింది. చిరంజీవి సినిమాతో బిజీగా ఉండడంతో స్టాలిన్ సినిమాను వదిలేసింది. ఆ దర్శకుడితో ఇది వరకే కోమలి అనే సినిమా చేసింది చందమామ. మరో అవకాశమిస్తే నో చెప్పేసింది.
పైసా వసూల్ :
బాలయ్య స్టార్ హీరోయిన్లతో నటించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఫామ్ లో లేని హీరోయిన్లకే ఎక్కువగా అవకాశాలు ఇస్తుంటాడు. స్టార్ హీరోయిన్ల వెంటపడి తీరా వాళ్లు డేట్స్ ఇవ్వకుండా లేట్ చేస్తే బాలయ్యకు అస్సలు నచ్చదు. అందుకే తన సినిమా తప్ప మరో సినిమాలో లేని హీరోయిన్లనే ఎంచుకుంటాడు. ఇదిలా ఉండగా.. ఈయన నటించిన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో ముందు కాజల్ నే హీరోయిన్ గా అనుకున్నారు. ఆ సమయంలో ఖైదీ నెంబర్ 150తో బిజీగా ఉండడంతో తేదీలు సర్దుబాటు చేయలేకపోయింది. అంతకు ముందే పైసా వసూల్ సినిమాను వదిలేసింది.
వైల్డ్ డాగ్ :
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నలుగురు అగ్ర హీరోల్లో ఇప్పటివరకు చిరంజీవితో మాత్రమే నటించింది. మిగిలిన ముగ్గురితో నటించే అవకాశమిచ్చినా కొన్ని కారణాలతో వదిలేసుకోవాల్సి వచ్చింది. నాగార్జునతో ఓ సినిమాను వదిలేసింది. ఈ చిత్రంలో ముందు కాజల్ నే తీసుకోవాలనుకున్నాడు దర్శకుడు సోలేమెన్. ఆ సమయంలో ఆమె పెళ్లి పనుల్లో బిజీగా ఉండడంతో వైల్డ్ డాగ్ లో నటించే అవకాశం రాలేదు.ప్రస్తుతం నాగార్జున, ప్రవీన్ సత్తారు సినిమాలో కాజల్ హీరోయిన్ గా ఎంపికైనప్పటికీ ప్రెగ్నెన్సీ కారణంగా ఆ సినిమాలోంచి తప్పుకుంది.
అమర్ అక్బర్ ఆంటోనీ :
రవితేజతో నటించే అవకాశం కూడా కాజల్ ఓసారి వదిలేసింది. ఇప్పటికే ఈయనతో రెండు సినిమాలు చేసింది. వీర, సారొచ్చారు సినిమాల్లో కలిసి నటించారు రవితేజ, కాజల్. ఈ రెండు సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. మూడవ సారి డిజాస్టర్ ఇచ్చే అవకాశాన్ని చాలా తెలివిగా వదిలేసింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ముందు కాజల్ నే హీరోయిన్ గా అనుకున్నారు. అప్పుడు ఉన్న బిజీ ప్రాజెక్ట్ ల వల్ల ఈ చిత్రాన్ని వదిలేసింది. రవితేజతో హ్యాట్రిక్ ఫ్లాప్ లు ఇచ్చే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. రవితేజ, కాజల్ అంటేనే నిర్మాతలు భయపడే పరిస్థితి వచ్చేది.
Also Read :
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అశ్విని ల పెళ్ళికి అశ్విని తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకోలేదు ?