Telugu News » Blog » కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అశ్విని ల పెళ్ళికి అశ్విని తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకోలేదు ?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అశ్విని ల పెళ్ళికి అశ్విని తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకోలేదు ?

by AJAY
Ads

క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. పునీత్ మ‌ర‌ణ‌వార్త విని ఆయ‌న అభిమానులే కాకుండా యావ‌త్ దేశ‌వ్యాప్తంగా ఉన్న సినీల‌వ‌ర్స్ బాధ‌ప‌డ్డారు. పునీత్ అభిమానులు ప్రేక్ష‌కుల ప‌రిస్థితే ఇలా ఉంటే ఆయ‌న కుటుంబ స‌భ్యుల ప‌రిస్థితి గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇప్పటికీ ఆయ‌న కుటుంబ స‌భ్యులు పునీత్ ను మ‌ర్చిపోలేక క‌న్నీళ్లు విడుస్తూనే ఉన్నారు.

పునీత్ రాజ్ కుమార్ అశ్వినిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక వీరిద్ద‌రి పెళ్లి విష‌యంలో కూడా సినిమా రేంజ్ ట్విస్ట్ లు ఉన్నాయి. నిజానికి పునీత్ రేంజ్ కు వ్యాపార‌వేత్త కూతురునో స్టార్ హీరోల కూతురునే వివాహం చేసుకోవాలి. కానీ అలా కాకుండా సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన అశ్విని ని పునీత్ వివాహం చేసుకున్నాడు. బంధువుల పెళ్లిలో పునీత్ రాజ్ కుమార్ అశ్వినిని చూసి మొద‌టి చూపులోనే ప్రేమ‌లో ప‌డ్డార‌ట‌.

ఆ త‌వ‌రాత వీరిద్ద‌రూ మ‌రో పెళ్లిలో క‌సులుకున్నార‌ట‌. కానీ పునీత్ స్టార్ కుమారుడు అన్న సంగ‌తి ఆమెకు తెలియ‌ద‌ట‌. ఆ త‌ర‌వాత వీరిద్ద‌రూ ప‌రిచ‌యం పెంచుకున్న త‌ర‌వాత పునీత్ స్టార్ హీరో కొడుకు అనే సంగ‌తి అశ్వినికి అర్థం అయ్యింద‌ట‌. ఇక పునీత్ తాను అశ్విని ప్రేమిస్తున్న విష‌యం కుటుంబం మొత్తానికి ఒకేసారి చెప్పాడ‌ట‌.అంద‌రూ ఒకే చెప్పారు. కానీ అశ్వినీ త‌ల్లిదండ్రులు మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోలేద‌ట‌.

puneeth rajkumar

puneeth rajkumar

సినిమా వాళ్ల కొడుకులు బ‌లాదూర్ గా తిరుగుతార‌ని అశ్విని తండ్రి వ‌ద్ద‌ని చెప్పాడ‌ట‌. అంతేకాకుండా పునీత్ కు చ‌దువులేద‌ని నో చెప్పాడ‌ట‌. దాంతో పునీత్ అశ్విని ఇంటికి వెళ్లి నేను ఎలాంటి క‌ష్టం రాకుండా అశ్విని చూసుకుంటాను అని మాటిచ్చాడ‌ట‌. దాంతో అశ్విని పేరెంట్స్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. పెళ్లి త‌ర‌వాత‌ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుండి రావ‌డంతో అశ్విని పెళ్లైన మొద‌ట్లో చాలా బ‌య‌ప‌డేద‌ట‌. దాంతో ఇంట్లో వాళ్ల‌తో మాట్లాడటం త‌క్కువేన‌ట‌. కానీ పునీత్ ఎంతో ప్రేమ‌గా చూసుకోవ‌డంతో మాట్లాడ‌క‌పోతే బంధం బ‌ల‌ప‌డ‌దు అని గ్ర‌హించి అంద‌రితోనూ క‌లిసిపోవ‌డం ప్రారంభించింద‌ట‌. ఇలా ఎన్నో క‌ల‌ల‌తో ప్రేమ‌వివాహం చేసుకున్న పునీత్ అశ్వినిల జంట పునీత్ మ‌ర‌ణంతో దూరం అవ్వాల్సి వ‌చ్చింది.

ALSO READ :  గోవిందా గోవిందా, శుభలగ్నం సినిమాలకి మధ్య ఇలాంటి సంబంధం ఉందా..?


You may also like