Home » చిరంజీవితో సినిమా చేయాలనుకొని.. ఇప్పటికీ చేయని దర్శకులు వీరే..!

చిరంజీవితో సినిమా చేయాలనుకొని.. ఇప్పటికీ చేయని దర్శకులు వీరే..!

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఈయన పడిన కష్టానికి నిజంగా మెగాస్టార్ అనేది గొప్ప గుర్తింపు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. ఈయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోయిన్లు సైతం పోటీ పడుతూ ఉంటారు.  అలాంటి తరుణంలో ఈయనతో నటించడానికి చాలా మంది నటులు కూడా ఉత్సాహం చూపిస్తూ ఉండేవారు. దర్శకులు అయితే ఈయనతో ఒక సినిమా చేస్తే చాలు.. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందవచ్చు అనుకున్న వాళ్లు కూడా ఉన్నారు.  ఇండస్ట్రీకి వచ్చిన తొలి నుంచి ఆయనతో ఓ సినిమా చేయాలనుకున్న చాలా మంది దర్శకులు వాళ్లు ఇండస్ట్రీకి వచ్చి 2 ఏళ్లు అయినా కూడా ఇప్పటివరకు చిరంజీవితో మాత్రం ఒక్క సినిమాను కూడా చేయలేకపోయారు. ఆ దర్శకులెవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

పూరి జగన్నాథ్ : 

Advertisement

పూరి జగన్నాథ్, చిరంజీవి అభిమానిగా సినీ ఇండస్ట్రీకి వచ్చాడు. అభిమానులు చిరంజీవిని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో క్యారెక్టర్ లో చిరంజీవి చూపించాలని పూరి చాలా ప్రయత్నం చేసినప్పటికీ ఎప్పటికప్పుడూ ఆ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.

రాజమౌళి : 

దర్శక ధీరుడుగా తనకంటూ ఓ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న రాజమౌళికి కూడా చిరంజీవి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నుంచి ఆయన సినిమాలను చూస్తూ  పెరగడం వల్ల రాజమౌళికి చిరంజీవి అంటే అభిమానం ఇష్టం ఉండేదట. తను కూడా చిరంజీవితో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇప్పటివరకు అది ఇంకా వర్కౌట్ కావడం లేదు.

సుకుమార్ : 

సుకుమార్ కి చిరంజీవి అంటే చాలా ఇష్టమల. ఒక రంగా సుకుమార్ ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి పాత్ర కీలకమనే చెప్పాలి. ఆయన కడా చాలా సార్లు చెప్పాడు కూడా. ఇలాంటి సుకుమార్ కూడా చిరంజీవి ఘో సినిమా చేయాలనుకున్నాడు. కానీ వీళ్ల కాంబోలో ఇప్పటివరకు సినిమా అయితే రాలేదు. మరీ దర్శకులతో ముందు ముందు సినిమా వస్తుందేమో చూడాలి మరీ.

Also Read  :  పవన్ కళ్యాణ్ ని తిట్టి సినిమా అవకాశాలు కోల్పోయిన స్టార్స్ వీరే

Visitors Are Also Reading