Home » పవన్ కళ్యాణ్ ని తిట్టి సినిమా అవకాశాలు కోల్పోయిన స్టార్స్ వీరే

పవన్ కళ్యాణ్ ని తిట్టి సినిమా అవకాశాలు కోల్పోయిన స్టార్స్ వీరే

by Anji
Ad

టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. తొలుత నుంచి ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రతీ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవ్వరూ సాధించలేని క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు.

Advertisement

 

ఇలాంటి తరుణంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు ఉండటంతో సినిమాలకు కొద్ది రోజుల పాటు బ్రేక్ ఇచ్చాడు. ఇప్పటికే కమిట్ అయినటువంటి కొన్ని సినిమాలు సెట్స్ మీదనే ఉన్నాయి. వీటన్నింటినీ ఈ ఏడాది పూర్తి చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ ని ఒకప్పుడు మీడియా ముఖంగా తిట్టిన కొంతమంది నటులకు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా పోయాయి.

Advertisement

ముఖ్యంగా శ్రీరెడ్డి ఒకరైతే.. పోసాని కృష్ణ మురళీ మరొకరు.. వీరిద్దరూ పవన్ కళ్యాణ్ ను దూషిస్తూ చాలా మాటలు మాట్లాడారు. దీంతో వాళ్లని ఇండస్ట్రీలో ఏ సినిమా లో కూడా తీసుకోవడానికి ఆయా దర్శకులు ఇష్టపడటం లేదు. ఎందుకు అంటే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరినైనా ఒక్కసారి వ్యతిరేకించారంటే.. వాళ్లు ఎవ్వరూ ఆ సినిమాలు చూడరు. కాబట్టి దర్శకులు వీళ్లని దృష్టిలో పెట్టుకొని రిస్క్ చేసే కంటే వాళ్ల ప్లేస్ లో మరో నటుడిని పెట్టుకోవడం బెస్ట్ అని అనుకుంటున్నారు. అందువల్లనే వాళ్లకి ఏ సినిమాలో కూడా అవకాశాలు రావడం లేదు. పోసాని ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నాడు. మొత్తానికి పోసాని ఆయన సినీ కెరీర్ ను చేజేతులారా నాశనం చేసుకున్నాడనే చెప్పాలి. 

Also Read :  విజయ్ పెళ్లిలో రష్మిక డ్యాన్స్..అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Visitors Are Also Reading