టాలీవుడ్ అగ్రహీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన సినిమాలు ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన సినిమా తీస్తే నిర్మాతలకు పెద్దగా నష్టం రాకుండా జాగ్రత్త పడతారు. నిన్న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి శుభాకాంక్షలు చెప్పారు.
ఇదే సమయంలో బాలయ్య సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇక ఇప్పటివరకు బాలయ్య హిట్ కొట్టిన దర్శకులు చాలా మంది ఉన్నారు. కానీ హ్యాట్రిక్ కొట్టిన దర్శకులు ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాలకృష్ణ హీరోగా 1984లో మంగమ్మగారి మనవడు సినిమా మంచి సూపర్ హిట్ అయింది. ఆ తరువాత 1986లో ముద్దుల కృష్ణయ్య సినిమా బంపర్ విక్టరీ కొట్టింది. 1987లో మువ్వా గోపాలుడు సినిమా కూడా హిట్ సాధించి నిర్మాతలకు అధిక లాభాలు తెచ్చిపెట్టింది. ఇక బాలయ్య నటించిన ఈ మూడు సినిమాలకు కూడా దర్శకుడు కోడిరామకృష్ణ కావడం విశేషం.
Advertisement
Advertisement
బాలకృష్ణతో హ్యాట్రిక్ కొట్టిన దర్శకుల్లో బి.గోపాల్ కూడా ఉన్నారు. అప్పట్లో ఆయన అసలు సిసలైన యాక్షన్ సినిమాలకు కేరాప్ అడ్రస్ బి.గోపాల్. 1990లో వచ్చిన లారీ డ్రైవర్, 1992లో వచ్చిన రౌడి ఇన్‌స్పెక్టర్, 1999లో లో వచ్చిన సమరసింహారెడ్డి సినిమాలు బాలయ్య కెరీర్‌ను ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. ఈ చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ సినిమాలతో పాటు బాలయ్యకు హ్యాట్రిక్ అందించాడు బి.గోపాల్. వీరి కాంబోలో వచ్చిన నాలుగవ సినిమా నరసింహనాయుడు సినిమా సూపర్ హిట్ చిత్రాల సరసన నిలిచింది.
అదేవిధంగా బాలయ్యకు హ్యాట్రిక్ అందించిన మరొక దర్శకుడు బోయపాటి శ్రీను. వీరిద్దరూ కలిసి 2010లో సింహా సినిమాతో హిట్ కొట్టారు. ఇక 2014లో లెజెండ్ సినిమాతో అభిమానులకు పూనకాలు తెప్పించాడు బాలయ్య. 2021లో అఖండ సినిమాతో బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందించి బాలయ్యతో హ్యాట్రిక్ కొట్టిన దర్శకునిగా నిలిచాడు బోయపాటి. ప్రస్తుతం బాలయ్య-బోయపాటి కాంబో అంటే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. వారి అంచనాలకు తగ్గట్టుగానే బోయపాటి కూడా సినిమా అదే రేంజ్‌లో తీసి హిట్ సాధిస్తున్నారు.
Also Read :
నయనతార తన పెళ్లికి ధరించిన చీర ధర ఎంతో తెలుసా..?
నయనతార కంటే విఘ్నేష్ శివన్ ఎన్నేళ్ళు చిన్నవాడో తెలుసా..?