Home » నయనతార కంటే విఘ్నేష్ శివన్ ఎన్నేళ్ళు చిన్నవాడో తెలుసా..?

నయనతార కంటే విఘ్నేష్ శివన్ ఎన్నేళ్ళు చిన్నవాడో తెలుసా..?

by AJAY

చాలా మంది సెలబ్రెటీ లు ప్రేమలో పడతారు. అయితే అందులో అతి కొద్ది మాత్రమే పెళ్లి వరకు వెళ్తారు. ఎన్నో ఏళ్ళు డేటింగ్ చేసినప్పటికీ పెళ్లి చేసుకోకుండా విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. కానీ పెళ్లి చేసుకున్న జంటలను వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. అలా పెళ్లి చేసుకుని ఒక్కటైన జంటలలో రీసెంట్ గా నయనతార విఘ్నేష్ జంట కూడా చేరింది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తమిళ దర్శకుడు విగ్నేష్ తో ప్రేమలో పడింది.

2015లో విజయ్ సేతుపతి నయనతార కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో విగ్నేష్ నయన్ మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుండి వీరి పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. దాదాపు ఆరేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.

అంతేకాకుండా కలిసి సినిమాలు కూడా చేశారు. రీసెంట్ గా వీరిద్దరి కాంబినేషన్ లో నే కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేదు. ఇక అంగరంగ వైభవంగా నయన్ విఘ్నేష్ వివాహం జరగగా ప్రస్తుతం వారి పెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరో వైపు ఓ వార్త సినిమా లవర్స్ ను షాక్ కు గురి చేస్తోంది. చాలా మంది సెలబ్రిటీలు వయసు భేదం పట్టించుకోకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంట విషయంలో కూడా అలానే జరిగింది. నయనతార 1954 నవంబర్ 18న జన్మించింది. విగ్నేష్ 1985 సెప్టెంబర్ 18 న జన్మించాడు. అంటే నయనతార విఘ్నేష్ శివన్ కంటే ఏడాది పెద్దది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

Also read : బాల‌య్య రీమేక్ చేసిన సినిమాలేంటో మీకు తెలుసా..?

Visitors Are Also Reading