Home » 10వ బ్యాట్స్ మెన్ గా వచ్చి.. సెంచరీలు చేసిన క్రికెటర్స్ వీరే..!

10వ బ్యాట్స్ మెన్ గా వచ్చి.. సెంచరీలు చేసిన క్రికెటర్స్ వీరే..!

by Anji
Ad

సాధారణంగా క్రికెట్ లో ఓపెనర్ గా ఫస్ట్ డౌన్ గా వచ్చిన వారు ఎక్కువగా సెంచరీ చేయడం మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో మిడిల్ ఆర్డర్ లో వచ్చిన వారు కూడా సెంచరీ సాధిస్తారు. కానీ 10వ బ్యాట్స్ మెన్ దిగిన వారికి సెంచరీ సాధించడం చాలా కష్టమైన పని అనే చెప్పాలి. ఇలాంటి అసాధ్యాలను సుసాధ్యం చేశారు కొంతమంది ఆటగాళ్లు. 10వ స్థానంలో బ్యాటింగ్ కి దిగి సెంచరీలు సాధించిన ఈ నలుగురు ప్లేయర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

 వాల్టర్ రీడ్ :

ఇంగ్లండ్ కి చెందిన వాల్టర్ రీడ్ 10వ స్థానంలో బ్యాటింగ్ కి దిగి సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ ఇతనే. 1884లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో వాల్టర్ 117 పరుగులు సాధించడం విశేషం. 

రెజినాల్డ్ డఫ్  :

Advertisement

ఆస్ట్రేలియా చెందిన క్రికెటర్ రెజినాల్డ్ డఫ్ 1982లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 10వ స్థానంలో ఆడాడు. ఆ సమయంలో ఇతను 104 పరుగులు చేశాడు. 

ఫ్యాట్ సిమ్ కాక్స్ :

దక్షిణాఫ్రికా కు చెందిన క్రికెటర్ ఫ్యాట్ సిమ్ కాక్స్ 1998లో జొహన్నెస్ బర్గ్ లో పాకిస్తాన్ పై జరిగిన మ్యాచ్ లో 10వ స్థానంలో బ్యాటింక్ వచ్చి 108 పరుగులు చేయడం విశేషం. 

అబుల్ హసన్ 

బంగ్లాదేశ్ క్రికెటర్ అబుల్ హసన్ 2012లో తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లోనే ఈ ఘనతను సాధించాడు. వెస్టిండిస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 10వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ సాధించాడు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 ‘అతని కొడుకు కోసం నా కెరీర్ నాశనం చేశాడు’.. అంబటి రాయుడు సెన్షేషన్ కామెంట్స్..!

అతని వల్లనే టీమిండియా WTC ఫైనల్ కి చేరుకుందా ? అందుకేనా కప్ మిస్..! 

Visitors Are Also Reading