నందమూరి తారకరామారావు సుదీర్ఘకాలం సినీ రంగంలో ఉన్నారు. ఆయన నట జీవితం అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా పంక్య్చూవాలిటీకి అన్నగారు పెద్దపీట వేసేవారు. సినిమా ఏదైనా షూటింగ్ ఎక్కడ జరిగినా సమయానికి అక్కడకు వెళ్లిపోవడం అన్నగారితోనే మొదలైందనే చెప్పాలి. గతంలో ఓల్డ్ ఆర్టిస్టులు కూడా.. ఆలస్యంగా వచ్చేవారు. దీంతో నిర్మాతలు ఇబ్బందులు పడేవారట.
Also Read : ‘నువ్ నాకు నచ్చావ్’ లాంటి బ్లాక్ బస్టర్ వదులుకొని కెరీర్ పోగొట్టుకున్న హీరో ఎవరంటే ?
Advertisement
చెన్నైలో అప్పట్లో బ్రిటిష్ వారి హయాంలో ఔట్ డోర్ షూటింగ్‌లకు నిర్ణిత సమయంలో దాటితే మళ్లీ అనుమతులు తీసుకోవాల్సి వచ్చి సినిమా షూటింగ్‌లు వాయిదా పడిన సందర్భాలు ఉన్నాయి. ఇన్‌డోర్ షూటింగ్‌లోను సమయానికి రాకపోతే ఇబ్బందులు ఎదురయ్యేవట. ఈ విషయంలో అన్న స్ట్రిక్టుగా ఉండేవారని ఇప్పటికే నాటి తరం సినిమా నటులు చెప్పుకుంటారు. అంతేకాదు. ఒక్క పంక్య్చూవాలిటిలోనే కాదు. సినిమా షూటింగ్ సమయంలో సిగరేట్లు తాగడం ఫ్రెండ్స్ వచ్చారని అభిమానులు వచ్చారని వారితో ముచ్చట్లు పెట్టుకోవడం వంటివి కూడా అన్నగారు చేసేవారు కారట.
ఇదంతా కూడా తోటి నటీనటులకు ఆదర్శంగా ఉండేదని, ఇప్పటికీ చెప్పుకుంటారు. అప్పట్లో సీనియర్ నటులు ఎక్కువగా సిగరేట్లు కాల్చేందుకు సమయం తీసుకునేవారట. దీంతో షూటింగులు ఆలస్యం అయ్యేవట. దీంతో నిర్మాతలు పైకి చెప్పలేక మనసులో దాచుకోలేక ఇబ్బందులు పడేవారట. ఇక అన్నగారి అలవాటు.. నిర్మాతలను గౌరవించడం, గతంలో పాతతరం నటులు కూడా నిర్మాతలకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు కారట.
Advertisement
నిర్మాతలు ఉన్నారంటే మేము సినిమాలు చేస్తేనే కదా.. అనే భావన వారిలో ఉండేదట. కానీ, అన్నగారు మాత్రం నిర్మాతలకు ఎనలేని గౌరవం ఇచ్చేవారట. నిర్మాతలు లేకపోతే సినిమాలు ఎక్కడ ఉన్నాయని ఆయన అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి చెన్నైలో పెద్ద సభ పెట్టి నటీనటులను పిలిచి మరీ క్లాస్ తీసుకున్నారట. నిర్మాత కన్న ముందే నటులు షూటింగ్ ప్లేస్‌లకు రావడం అనేది అన్నగారి నుంచే అలవాటు చేసుకున్నారు. నిర్మాత షూటింగ్ ప్రాంతానికి వచ్చాక కూర్చున్న చోట నుంచి షూటింగ్‌లో ఉంటే అది అయ్యాక వచ్చి.. నిర్మాతను రిసీవ్ చేసుకుని నమస్కారం పెట్టడం అనేది అన్నగారు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారనే విషయాన్ని స్పష్టం చేసింది.
ఇది ఆయన సినీ నట జీవితంగా చివరకు పాటించిన అద్భుత పాఠంగా చెబుతారు. అంతేకాదు. గ్రూపులు కట్టడం, గొడవలకు దిగడం.. తోటి నటులను విమర్శించడం.. కయ్యాలు పెట్టుకోవడం వంటి వాటిని అన్నగారు అస్సలు సహించే వారు కాదని అంటారు. ఇవన్నీ అన్నగారిలో ఉన్న ప్రత్యేకతలు అయితే ఇవన్నీ ఇప్పుడు ఎలా ఉన్నప్పటికీ నిర్మాతల విషయంలో మాత్రం అన్నగారు వేసిన బాటను ఇప్పటికీ చాలా మంది యువతరం నటులు కూడా పాటిస్తుండడం గమనార్హం.
Also Read : RRR : అభిమానులను కంట్రోల్ చేసేందుకు ఏమి చేశారో చూడండి..!