Home » RRR : అభిమానుల‌ను కంట్రోల్ చేసేందుకు ఏమి చేశారో చూడండి..!

RRR : అభిమానుల‌ను కంట్రోల్ చేసేందుకు ఏమి చేశారో చూడండి..!

by Anji
Ad

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సినిమా అంటేనే అదొక క్రేజ్ ఉంటుంది. దేశ వ్యాప్తంగా రాజ‌మౌళికి ఎంతో మంది అభిమానులున్నారు. కేవ‌లం రాజ‌మౌళి అభిమానులే కాకుండా ఓవైపు ఎన్టీఆర్‌, మ‌రొక వైపు రామ్ చ‌ర‌ణ్ వీరిద్ద‌రూ స్టార్ హీరోలు కావ‌డంతో ఇంకా ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. వీరి ముగ్గురి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా RRR మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీగా విడుద‌లవుతున్న విష‌యం తెలిసిందే.

Also Read :  ‘నువ్వు నాకు న‌చ్చావ్’ సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రో తెలుసా..?

Advertisement


ఈ సినిమాను ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా జ‌క్క‌న్న తెర‌కెక్కించ‌డంతో అంద‌రూ ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభ‌మ‌య్యాయి. కొన్ని చోట్ల ప్రారంభ‌మైన నిమిషాల వ్య‌వ‌ధిలోనే హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇక అభిమానులు కూడా థియేట‌ర్ల వ‌ద్ద సంద‌డి చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇప్ప‌టికే థియేట‌ర్ల వ‌ద్ద భారీ క‌టౌట్లు కూడా సిద్ధం చేశారు.

Advertisement

మెగాఫ్యాన్స్‌తో పాటు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సినిమా థియేట‌ర్ల వ‌ద్ద హంగామా చేస్తారు కాబ‌ట్టి థియేట‌ర్ల య‌జ‌మానులు అలెర్ట్ అయ్యారు. ఏదైనా తేడా వ‌స్తే థియేట‌ర్ల‌లో అభిమానులు బీభ‌త్సం సృష్టిస్తారు. ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు కూడా తీసుకుంటున్నారు. స్క్రీన్ ముందు భాగంలో అభిమానుల‌ను అడ్డుకునేందుకు ప్ర‌త్యేకంగా మేకులు కొట్టించారు. ఎవ్వ‌రూ స్క్రీన్ వ‌ద్ద‌కు రాకుండా ఉండేందుకు ఇలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ అవుతున్నాయి. అది ఎక్క‌డో కాదు.. విజ‌య‌వాడ అన్న‌పూర్ణ థియేట‌ర్‌లో అభిమానులు స్క్రీన్ వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా పోడియంపై మేకులు బిగించారు. ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Also Read :  విశాఖ ఉక్కు ప్రైవేటీకర‌ణ‌కు నిర‌స‌న‌గా వైసీపీ వినూత్న నిర‌స‌న

Visitors Are Also Reading