Home » చిరంజీవి సినీ కెరీర్ లో భారీ డిజాస్టర్ మూవీస్ ఇవే..!

చిరంజీవి సినీ కెరీర్ లో భారీ డిజాస్టర్ మూవీస్ ఇవే..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎవరైనా తెలిసిన వాళ్లు ఉంటే ఇక్కడ అవకాశాలు ఈజీగా వస్తాయి. అలా కాదని ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇక్కడ మనమే సొంతంగా ట్రైల్స్ చేయాలంటే మాత్రం చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న సినీ నేపథ్యం లేనప్పటికీ నటుడిగా అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా మారారు చిరంజీవి. ఆయన కెరీర్ లో నటించిన సినిమాల్లో సూపర్ హిట్స్ చాలా ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్,  కృష్ణ, శోభన్ బాబు,  కృష్ణంరాజు జనరేన్ల తరువాత తరంలో అత్యధికంగా ఇండస్ట్రీ హిట్స్ సాధించిన రికార్డు చిరంజీవిదే. విజయాలతో పాటు చిరంజీవి కెరీర్ లో డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా విడుదలైన భోళా శంకర్ మూవీ మాత్రం మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ రోజు ఈ మూవీ రూ.20 కోట్ల నుంచి రూ.25 వరకు వసూలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే చిరంజీవి కెరీర్ లో భారీ డిజాస్టర్ మూవీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

 

 ఆచార్య 

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మూవీ ఆచార్య. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ లోనే భారీ ఫ్లాప్ గా మిగిలింది. 

సైరా నరసింహారెడ్డి 

Advertisement

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాను ఆయన కుమారుడు రామ్ చరణ్ నిర్మించారు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో దాదాపు రూ.30కోట్ల వరకు నష్టం వచ్చినట్టు టాక్ వినిపించింది.

శంకర్ దాదా జిందాబాద్ 

బాలీవుడ్ లో హిట్ అయిన లగేరహో మున్నాభాయ్ మూవీని తెలుగులో చిరంజీవి హీరోగా శంకర్ దాదా జిందాబాద్ గా ప్రభుదేవా దర్శకత్వంలో రీమేక్ చేశారు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. 

మృగరాజు

మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ మృగరాజు. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.

అంజి 

కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన మూవీ అంజి. ఈ సినిమాని నిర్మాత శ్యామ్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది.  ఈ సినిమాలో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా నటించారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 Chiranjeevi: చైనాలో చిరంజీవి క్రేజ్ మాములుగా లేదుగా!.. మెగాస్టార్ పైనే ప్రెసెంటేషన్ ఇచ్చిన చిన్నారి.. అసలు స్టోరీ ఏంటంటే?

 రజనీకాంత్ తాజా ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

రాజమౌళి ఫ్యామిలీ చేసే ప్లాన్ గురించి మీకు తెలుసా ?

Visitors Are Also Reading