టాలీవుడ్ దర్శకుల్లో హను రాఘవపూడి ఒకరు. ఈయన దాదాపు తెలుగు సినీ ప్రేక్షకులందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. రాఘవపూడి దర్శకత్వం వహించిన సినిమాలు చాలా వరకు సక్సెస్ అందుకున్నాయి. కేవలం దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్‌గా పని చేశాడు. ఈయన దర్శకత్వం వహించే సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారనే చెప్పవచ్చు. మొదటిసారిగా 2012లో అందాల రాక్షసి సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ఆ తరువాత 2017లో కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాకు దర్శకత్వం వహించాడు హను రాఘవపూడి. ఈ చిత్రం కూడా విజయం సాధించింది.
Advertisement
2017లోనే లై సినిమాను తెరకెక్కించాడు. ఇక ఆ తరువాత 2018లో పడి పడి లేచే మనసు, ఈ ఏడాది సీతారామం సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలు అన్ని హను రాఘవపుడికి మంచి గుర్తింపును అందించాయి. ఈ సినిమాలన్నీ మంచి ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే హను రాఘవపూడి చాలా వరకు తన సినిమాలకు కొత్త హీరోయిన్‌లనే పరిచయం చేశాడు. అందులో అందాల రాక్షసి సినిమాతో ఈ అందాల తార లావణ్య త్రిపాఠిని పరిచయం చేశాడు. ఈ సినిమాతో లావణ్య త్రిపాటి ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ తరువాత వరుసగా చాలా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. స్టార్ హీరోల సరసన కూడా నటించింది. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మెహరీన్ ను పరిచయం చేసాడు. మెహరీన్ కూడా ఈ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆ తరువాత దాదాపు 20 సినిమాలకు పైగా నటించింది.
Advertisement
ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉంది. లై సినిమాతో మేఘా ఆకాశ్‌ని పరిచయం చేశాడు డైరెక్టర్ హను రాఘవపూడి. ఈమె కూడా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్నది. అంతేకాదు.. తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి అక్కడ వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె ఖాతాలో వరుసగా 9 సినిమాలు ఉండడం విశేషం. ఇక ఇటీవలే విడుదలైన సీతారామం సినిమాలో కొత్త హీరోయిన్‌ను పరిచయం చేశాడు. ఆమె పేరు మృణాల్ ఠాకూర్. తన తొలిసినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఇక ఈమె గురించి అయితే అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. దర్శకుడు హాను రాఘవపూడి తన తరువాత సినిమాకి ఏ హీరోయిన్ ని పరిచయం చేస్తాడో వేచి చూడాలి మరీ.
Also Read :
పోకిరి సినిమాను రీ రిలీజ్ చేసి నిర్మాతలు ఎంత లాభం పొందారో తెలుసా..?
“విక్రమార్కుడు” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..!