Home » KGF-2 మూవీ చూశారా.. రాఖీని చూసి ఈ 5 జీవిత పాఠాలు నేర్చుకోవాల్సిందే..?

KGF-2 మూవీ చూశారా.. రాఖీని చూసి ఈ 5 జీవిత పాఠాలు నేర్చుకోవాల్సిందే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కేజిఎఫ్ 1&2 మూవీస్ తో పాన్ ఇండియా లెవల్ లో ఎంతో పేరు సంపాదించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు హీరో యష్.. ఈ సినిమా బాక్సాఫీస్ ను కొల్లగొట్టి దూసుకు పోయింది అని చెప్పవచ్చు. ఈ మూవీలో హీరో రాఖీ బాయ్ ని చూసి నిజ జీవితంలో మనం కొన్ని విషయాలను తప్పనిసరిగా ఆపాదించు కోవాలి. అవేంటో ఓసారి తెలుసుకుందాం..?

1.పట్టుదల
ఈ మూవీలో హీరోకు ఉండేటువంటి పట్టుదలను చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు. సినిమాలో ముంబై వీధుల్లో తిరిగే ఒక అనాధ రాఖీ. ఆ అనాదనే దేశంలోనే చాలా పవర్ఫుల్ గా మార్చింది తన పట్టుదల అని చెప్పవచ్చు. పట్టుదలతో తను అనుకున్నది సాధిస్తాడు. అంటే మనం మానవ జీవితంలో కూడా పట్టుదల అనేది ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఈ మూవీ ద్వారా అర్థం చేసుకోవచ్చు.

Advertisement

2.కలలు కనాలి
ఈ సినిమాలో కూడా రాఖీకి ఒక పెద్ద డ్రీమ్ ఉంది.అదే ప్రపంచాన్ని గెలవాలని, ఇలా అతి పెద్ద డ్రీమ్ ని పెట్టుకొని ఆయన ముందుకు వెళ్తారు. అది మనం అనుకున్నంత ఈజీ కాకపోవచ్చు కానీ, మన డ్రీమ్ అనేది చాలా ఎంత పెద్దగా ఉంటే మన నిజజీవితంలో కూడా దానిపై ఎంత ఫోకస్ పెట్ట గలుగుతాం. కలలు కనాలి కానీ వాటిని నిజం చేసుకునే దిశలో మనం ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి.

3. నిజమైన నాయకుడు
కే జి ఎఫ్ సినిమాలో రాఖీ బాయ్ నాయకుడిగా పేరు పొందడానికి వారిని మోటివేట్ చేయడం కానీ, స్పీచ్ లు ఇవ్వడం కాని, బెదిరించి వారి వైపు జనాల్ని తిప్పుకోవడం కానీ చేయలేదు. వారందరినీ నేను మార్చగలను అని తన యాక్షన్ ద్వారా మాత్రమే తెలియజేశారు. సినిమాలో గరుడని చంపినప్పుడు గాని, అందులో ఉండే బానిసలకు మంచి లైఫ్ ను అందించినప్పుడు కానీ అందులో ఉండే బానిసలు అందరూ రాఖీ ఒక్కడే వారందరినీ అంతం చేసి మన బానిసత్వం నుంచి తొలగించగలరు అని నమ్మారు. అంటే మన నిజజీవితంలో కూడా మనం లీడర్ అవ్వడానికి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మన పనిని బట్టి మన వ్యక్తిత్వాన్ని బట్టి వారే మనకు లీడర్షిప్ అనేది ఇస్తారు.

Advertisement

4. కష్టం వచ్చినప్పుడు కంగారు పడకూడదు
కే జి ఎఫ్ చాప్టర్1 లో గరుడ ను చంపలేక ఫెయిల్ అయినప్పుడు నిజంగా వాళ్ళు అంత టెన్షన్ తో చావు భయాన్ని తలచుకుంటూ కంగారు పడతారు. కానీ రాఖీ మాత్రం ఎంతో సింపుల్ గా నిలబడి తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే చార్టరు 2లో రాఖీ అస్సలు ఆలోచించని మూమెంట్లో అదీరా అటాక్ చేస్తాడు. కానీ ఈ సమయంలో రాఖీ కామ్ గా తన మాస్టర్ ప్లాన్ ని అమలు చేస్తూ అధిరాని చావు దెబ్బ తీస్తాడు. ముఖ్యంగా మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడకుండా కామ్ గా ఆలోచించి ముందుకు పోతే తప్పనిసరిగా దానికి సొల్యూషన్ దొరుకుతుంది.

5. ఈగోనూ పక్కన పెట్టి గోల్స్ కోసం పోరాడాలి
ముఖ్యంగా మన లైఫ్ ని మన లక్ష్యాన్ని నాశనం చేసేవి ఈగో. అలాంటి ఇగోని ఎంత కంట్రోల్ చేయగలిగితే మనం విజయతీరాలకు అంత ముందుగా వెళ్లగలం. కే జి ఎఫ్ చాప్టర్ 2 లో రాఖీ కిడ్నాప్ చేసి ఉంచిన వానరంని కలుస్తాడు. నువ్వు రాజ్యానికి సేవకుడివీ కానీ రాజు కాదని, రాజ్యం అన్న తర్వాత రాజులు మారుతూ ఉంటారు. నువ్వు మాత్రం అలానే ఉంటావు అని చెప్పి తన కోసం పని చేసే లాగా కన్విన్స్ చేస్తాడు. రాఖీ దగ్గర పెద్ద ఆర్మీ ఉంది కానీ వారు ఎలా యుద్ధం చేయాలో చెప్పడానికి ఒక సేనాధిపతి కావాలి. దానికోసమే వానరములు మెస్మరైజ్ చేస్తాడు. ముందుగా రాఖీ తను చంపాలనుకున్న వాటిని చంపకుండా అతని ప్రొటెక్షన్ ని మార్చేస్తాడు. అంటే ఈగోకి పోకుండా తన గోల్ కి మాత్రమే ప్రయారిటీ ఇస్తాడు. అలాగే నిజజీవితంలో కూడా మనకు ఏదైనా ఈగో ఉంటే పక్కనపెట్టి మన లక్ష్యాన్ని సాధించే దిశలో ముందుకు పోవాలి.

also read;

ఎన్టీఆర్ కి మానవరాలిగా నటించి.. మళ్ళీ హీరోయిన్ గా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా ?

నాగచైతన్య కొరకు భారీ ప్రాజెక్టును రిజెక్ట్ చేసిన సమంత.. ఏం జరిగిందంటే..?

 

 

 

Visitors Are Also Reading