Home » అక్కడ ప్రతి మగాడు తప్పనిసరిగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే..!

అక్కడ ప్రతి మగాడు తప్పనిసరిగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే..!

by Anji
Published: Last Updated on
Ad

ప్రస్తుతం మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. అయితే ప్రతీ రోజు సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీని కారణంగా మానవుల జీవితం గతం కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. చాలా మంది నిపుణులు జీవితాన్ని సుఖవంతం చేయడానికి పగలు, రాత్రి కష్టపడుతున్నారు. ప్రపంచం చాలా పెద్దది. కొంత మంది మనం చూడగలిగే దానికంటే.. లోతుగా జీవిస్తారు. నేటికీ కొన్ని తెగలు సామాన్యులకు దూరంగా ఉండేందుకు ఇష్టపడుతున్నాయి. అంతేకాదు.. వారికి కొన్ని నియమ, నిబంధనలుంటాయి. వాటిని శతాబ్దాలుగా అనుసరిస్తున్నాం.

Advertisement

వాటిలో ముఖ్యమైనది పెళ్లి. ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహం ఎంతో కీలకమైన ఘట్టం. చనిపోయే వరకు గుర్తుంచుకునే మధురమైన  జ్ఞాపకం.. ఆ రోజు నుంచే లైఫ్ లో కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది. పెళ్లి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వివాహం సంప్రదాయాలు రాష్ట్రాన్ని, సామాజిక వర్గాన్ని బట్టి మారుతుంటాయి. అంతేకాదు.. వివాహ చట్టాలు వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉంటాయి. పాతకాలంలో బహు భార్యత్వ విధానం ఉండేది. పురుషుడు ఎంతమందినైనా భార్యలుగా చేసుకునే పద్దతిని పాటించేవారు. కానీ కాల క్రమణేలా ఆ సంప్రదాయం కనుమరుగైపోయింది. చాలా చోట్ల ఏక పత్రీవ్రతాన్నే అనుసరిస్తున్నాయి. ఒకవేళ రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. మొదటి భార్యకు తప్పనిసరి విడాకులు ఇవ్వాలి. కొన్ని ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే సంప్రదాయముంది. 

ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా దేశంలో వింత వివాహం ేసుకునే సంప్రదాయముంది. ఇది సంప్రదాయం మాత్రమే కాదు.. చట్టం కూడా.. అక్కడ ప్రతీ పురుషుడు రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి. ఒకవేళ రెండో పెళ్లి నిరాకరిస్తే.. వారిని జైలులో వేస్తారు. ఏకంగా జీవిత ఖైదు శిక్ష విధిస్తారు. స్త్రీలు కూడా దీనిని అంగీకరించాలి. మరో మహిళతో కలిసి భర్తను పంచుకోవాలి. కాదని అడ్డు చెబితే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అందుకు ఇష్టం ఉన్నా.. లేకపోయినా భర్తతో సంతోషంగా లేకున్నాఅందరూ ఈ నిబంధనను పాటించాలి. పురుషులు కూడా తనకు ఇష్టం లేకపోయినా.. పోషించే శక్తిపోయినా కచ్చితంగ రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.  ఇద్దరూ భార్యలను చూసుకోవాల్సిందే. అందుకు సంప్రదాయాలకు విలువనిస్తూ.. చట్టాలని గౌరవిస్తూ అక్కడి మగవారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారు.

Advertisement

పురుషులు తప్పనిసరిగ్గా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలనే నిబంధన వెనుక ఓ బలమైన కారణం ఉంది. మనదేశంలో స్త్రీ, పురుషుల నిష్పత్తి తక్కువగా ఉంటుంది. మనదేశంలో పురుషుల కంటే స్త్రీలు తక్కువగా ఉంటారు. ఎరిత్రియాలో అలాకాదు.. పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉంటుంది. అందుకే స్త్రీ, పురుష నిష్పత్తిని బ్యాలెన్స్ చేయడానికి పురుషులు రెండు పెళ్లిళ్లు చేసుకోవాలనే నిబంధన తీసుకొచ్చారు. చట్టం ప్రకారం.. ఎవరైనా ఒకే భార్యను కలిగి ఉంటే.. దోషిగా పరిగణిస్తారు. చట్టం ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తమ దేశంలో ఉన్న స్త్రీ, పురుష నిష్పత్తిని నియంత్రించేందుకు రెండు పెళ్లిళ్ల విధాానాన్ని ఎరిత్రియా అమలు చేస్తోంది.

 

పెళ్లి, ఓటు హక్కు డ్రైవింగ్ కి కనీసం వయస్సు దేశాన్ని బట్టి మారుతుంటుంది. ఆయా దేశాల్లో పరిస్థితులకు అనుగుణంగా వీటిని నిర్ణయిస్తారు. ఎరిత్రియా కూడా పెళ్లి విషయంలో రెండు వివాహాల విధానాన్ని అమలు చేస్తోంది. మరోవైపు ఎరిత్రియాలో రెండు పెళ్లిళ్లు తప్పనిసరిగ్గా చేసుకోవాలనే నిబంధన ఏమి లేదనే వాదనలు ఉన్నాయి. రెండు పెళ్లిళ్లు చేసుకోవడం నేరం మాత్రం కాదంటున్నారు. ఒక పురుషుడు ఒక పెళ్లి అయినా చేసుకోవచ్చు. రెండు అయినా చేసుకోవచ్చు. పూర్తిగా ప్రజల ఇష్టయిష్టాలకే వదిలేసిందని చాలా మంది చెబుతున్నారు. మరికొందరూ మాత్రం రెండు పెళ్లిళ్ల నిబంధన పక్కాగా అమలు చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Visitors Are Also Reading