Home » బాలయ్య విక్రమసింహా భూపతి ఆగిపోవడానికి కారణం తెలుసా..?

బాలయ్య విక్రమసింహా భూపతి ఆగిపోవడానికి కారణం తెలుసా..?

by Sravya
Ad

చాలామంది హీరోలు అవ్వాలనుకుని ఇండస్ట్రీ లోకి వస్తూ ఉంటారు. అయితే అనుకున్నంత మాత్రాన అందరూ సక్సెస్ ని అందుకోలేరు. మధ్యలోనే కొంత మంది ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోతూ ఉంటారు. ఇక బాలయ్య విషయానికి వస్తే, బాలయ్య ఇండస్ట్రీలో ఇప్పుడు కూడా దూసుకు వెళ్ళిపోతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. వాళ్లలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు తక్కువ సమయం లోనే ఇండస్ట్రీ నుండి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు ఇండస్ట్రీలో ఉన్న నలుగురు స్టార్ హీరోల్లో బాలయ్య కూడా ఒకరు.

Advertisement

సీనియర్ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఇండస్ట్రీలోకి బాలయ్య వచ్చారు తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు. ఇప్పుడు కూడా కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నారు బాలకృష్ణ రామకృష్ణ దర్శకత్వంలో చాలా సూపర్ హిట్ లు వచ్చాయి. వాటిల్లో మంగమ్మగారి మనవడు మువ్వగోపాలుడు ముద్దుల మావయ్య వంటి సినిమాలు బాలయ్య కెరియర్లో బెస్ట్ సినిమాలని చెప్పచ్చు. 2001లో వచ్చిన కోడి రామకృష్ణ బాలయ్య కాంబినేషన్లో విక్రమ సింహ భూపతి అనే ఒక జానపదం మూవీ ని కూడా తెరకెక్కించే ప్రయత్నాన్ని చేశారు.

Advertisement

ఈ సినిమాని అనౌన్స్ చేసి కొద్దిరోజులు షూటింగ్ కూడా జరపారు. తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన గోపాల్ రెడ్డి అలానే బాలయ్య మధ్య జరిగిన కొన్ని విభేదాల కారణంగా మూవీ ఆగిపోయింది. ఇలా విక్రమ సింహ భూపతి మూవీ ఆగిపోయింది లేదంటే బాలయ్య ఖాతాలో ఒక హిట్ పడేదేమో..? ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి రాబోతోంది బాలయ్య ఇప్పుడు కూడా అదే జోష్తో కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. బాలయ్య బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమాతో కూడా హిట్ కొట్టాలని ఫాన్స్ అయితే భావిస్తున్నారు మరి బాలయ్యకి ఆ సినిమా ఎంతవరకు కలిసి వస్తుందనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading