Home » రోజ్ వాటర్ వల్ల ఉపయోగాలు ఎన్నో.. వీటిని ఎలా వినియోగించుకోవాలంటే..?

రోజ్ వాటర్ వల్ల ఉపయోగాలు ఎన్నో.. వీటిని ఎలా వినియోగించుకోవాలంటే..?

by Anji
Ad

చలికాలంలో సాధారణంగా చర్మం పగులుతుంటుంది.  చర్మం విషయంలో ఈ సీజన్ లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్. మీ చర్మ సంరక్షణ కోసం రోజ్ వాటర్  ఎన్నో  అద్భుతమైన ప్రయోజనాలను అందించగలదు.  మనం దీనిని  అన్ని రకాల చర్మాలకు వినియోగించవచ్చు.  గులాబీ రేకులను నీటిలో నానబెట్టి తయారు చేసిన రోజ్ వాటర్ పురాతన కాలం నుంచి సౌందర్య సాధనంగా ఉపయోగిస్తున్నారు.  అందంగా ఉండాలని కోరుకునే ప్రతీ అమ్మాయి ఇంట్లో ఇది తప్పకుండా ఉంటుంది. దీని ధర తక్కువగానే  అందుబాటులో ఉండడంతో పాటు  ప్రతీ ఒక్కరూ వాడుతున్నారు. రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.

Advertisement

రోజ్ వాటర్ ఇంట్లో ఉంటే చాలు.. ఖరీదైన టోనర్లు, సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములతో అసలు అవసరం ఉండదు.  దీని లక్షణాలు దెబ్బతిన్న చర్మాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతాయి. ఇది క్రిమిసంహారినిగా కూడా పని చేయడం వల్ల చర్మవ్యాధులను కొంత వరకు నివారిస్తుంది. అందువల్ల రోజ్ వాటర్ ని ఉత్తమ స్కిన్ టోనర్ అని పిలుస్తారు. చర్మం సహజ పీహెచ్ సంతులనాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. రోజ్ వాటర్ ని వారానికి రెండు సార్లు చర్మానికి రాసుకుంటే ఎప్పటికప్పుడూ వచ్చే అధిక సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ ప్లమేటరీ లక్షణాలు ఎరుపు, చర్మ శోథ, తామర వంటి వివిధ చర్మ సమస్యలను నివారిస్తాయి. 

Advertisement

Also Read :  హీరో రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా కథ అదేనా ?

Rose Water Manam News

మొటిమల సమస్య ఉన్నవారు రోజ్ వాటర్ ని ఉపయోగించవచ్చు. అడ్డుపడే రంద్రాల నుంచి పేరుకుపోయిన ఆయిల్, ధూళిని తొలగిస్తుంది. రోజ్ వాటర్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మచ్చలు, గాయాలు, కోతలను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది. రోజ్ వాటర్ జట్టు సంబంధిత సమస్యలకు ఉపయోగపడుతుంది. ఇది తేలికపాటి స్పాల్ప్ ఇన్ ఫ్ల మేషన్, చుండ్రుకి చికిత్స చేయగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. సహజమైన కండీషనర్ గా పని చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రోజ్ వాటర్ లో కాటన్ ప్యాడ్ లను ముంచి మీ కనురెప్పలపై అప్లై చేయండి. మీ కళ్ల చుట్టూ ఉన్న వేడిని తగ్గించడం ద్వారా తక్షణ ఉపశమనం పొందుతారు. 

Also Read :  మెగాస్టార్ బాస్ పార్టీ సాంగ్ ని ముందే చూసేసిన పవర్ స్టార్..!

Visitors Are Also Reading