Home » మెగాస్టార్ బాస్ పార్టీ సాంగ్ ని ముందే చూసేసిన పవర్ స్టార్..!

మెగాస్టార్ బాస్ పార్టీ సాంగ్ ని ముందే చూసేసిన పవర్ స్టార్..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య సెట్ లో బాస్ పార్టీ సాంగ్ ని తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీక్షించారు. హరిహరవీరమల్లు హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్, నిర్మాత ఏ.ఎం.రత్నం వాల్తేరు వీరయ్య సినిమా సెట్స్ ని సందర్శించారు. రేపు అధికారికంగా విడుదల కాబోయే బాస్ పార్టీ సాంగ్ ని ముందుగానే  పవన్ కళ్యాణ్ వీక్షించారు. ఈ పాట చాలా బాగుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

Advertisement

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో తన అనుభవాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు దర్శకుడు బాబీ. పవన్ కళ్యాణ్ షూటింగ్ వద్దకి వెళ్లి పాటను వింటున్న చిత్రాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇవాళ విడుదలైన ప్రోమోకి మంచి ఆదరణ లభిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ మాస్ ప్రేక్షకుల కోసం సిద్ధం చేసిన ఈ పాటలో చిరంజీవి సరసన ఊర్వశి రౌతెలా అద్భుతంగా డ్యాన్స్ చేసిందనే చెప్పాలి. నకాష్ అజీజ్, హరిప్రియతో కలిసి దేవి శ్రీ ప్రసాద్ పాడిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మాస్ మహారాజా రవితేజ వాల్తేరు వీరయ్య చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

Advertisement

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆర్థర్ ఏ విల్సన్ కెమెరా మెన్, నిరంజన్ దేవరనూనె ఎడిటర్, ఏ.ఎస్. ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్, సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు బాబీ స్వయంగా కథ, మాటలు రాయగా.. కోనవెంకట్, కె.చక్రవర్తి రెడ్డిలు స్క్రీన్ ప్లే రాశారు. ఇక రైటింగ్ డిపార్ట్ మెంట్ లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా ఉన్నారు. 2023 సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Also Read :  క్షీణించిన సమంత ఆరోగ్యం.. అపోలో ఆసుపత్రికి తరలింపు ?

Visitors Are Also Reading