తెలంగాణ శకుంతల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. శకుంతల ముందుగా రంగస్థలం ద్వారా పరిచయం అయ్యారు. ఒంటికాలి పరుగు నాటికతో రంగస్థల ప్రవేశం చేసారు. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఈమె అసలు పేరు కడియాల శకుంతల. 1979లో మా భూమి ద్వారా తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించారు. దాదాపు 250కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
Advertisement
తెలంగాణ, రాయలసీమ యాసతో ఆకట్టుకున్నారు. ప్రధానంగా విలన్ పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు అందుకున్నారు. రంగస్థల నటిగా తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించిన శకుంతల తరువాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చాలా సినిమాల్లో విలక్షణ పాత్రలతో మెప్పించారు. ఎన్నో సినిమాలలో విలక్షణ పాత్రల్లో మెప్పించిన ఆమె.. 2014 జూన్ 14న అకాల మరణం చెందారు. శకుంతల మృతి.. తెలుగు సినీ పరిశ్రమలో తీరని లోటు.. తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆమె జీవితంలో ఎన్నో విషాదాలున్నాయని చాలా తక్కువ మందికే తెలుసు. ఎప్పుడూ డేరింగ్ డాషింగ్ మహిళగా కనిపించే ఆమె కుటుంబం కోసం పడిన కష్టాలు అన్ని ఇన్నికావు. ప్రధానంగా ఆమె రెండుసార్లు భయంకరమైన యాక్సిడెంట్స్ కి గురై ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కష్టాలకు ఆమె ఎదురు వెళ్లి ఆత్మస్థైర్యంతో నిలబడ్డారు.
Advertisement
Also Read : “ఒక్కడు” సినిమా కోసం ఆ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన మహేష్ బాబు….ఆ సినిమా ఏదంటే ?
యాక్సిడెంట్ లో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి. డాక్టర్లు సర్జరీ చేయాలని పేర్కొన్నారు. ఆమె నటించలేనేమో అని చాలా బాధపడ్డారు. ఆ తరువాత ఆమె కోలుకొని పలు చిత్రాలలో నటించారు. మా భూమి సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించిన.. పలు సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా ఒసేయ్ రాములమ్మ సినిమాలో అద్భుతమే అని చెప్పాలి. అందులో తెలంగాణ యాసతో ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత తేజ తెరకెక్కించిన నువ్వు నేను సినిమాతో కూడా మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాలో ఆమె నటనకు, డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కేవలం విలన్ గా మాత్రమే కాదు.. సీరియస్ లుక్ తో కామెడీ ఆడియన్స్ ని కూడా నవ్వించారు. వెంకటేష్ లక్ష్మీ సినిమాలో వేణుమాదవ్, తెలంగాణ శకుంతల మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను ఎంతగా నవ్వించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
Also Read : ఈ స్టార్ విలన్ ఎలా చనిపోయారో తెలిస్తే..కన్నీళ్లు అస్సలు ఆగవు.!