Home » “ఒక్కడు” సినిమా కోసం ఆ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన మహేష్ బాబు….ఆ సినిమా ఏదంటే ?

“ఒక్కడు” సినిమా కోసం ఆ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన మహేష్ బాబు….ఆ సినిమా ఏదంటే ?

by AJAY
Ad

మహేష్ బాబు కెరీర్ బెస్ట్ సినిమాలలో ఒక్కడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతోనే మహేష్ బాబు మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఈ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. టీవీలో వస్తే మిస్ కాకుండా చూసే అభిమానులు చాలామంది ఉన్నారు. ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్ విలన్ గా నటించాడు.

Advertisement

గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఎమ్మెస్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. రేపటితో ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఎమ్మెస్ రాజు సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మహేష్ బాబుకు మొదట తాను ఒక కథను వినిపించానని చెప్పారు. ఆ కథ బానే ఉంది కానీ తనకు వర్కౌట్ కాదని అన్నారని చెప్పారు.

Advertisement

మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమానే మనసంతా నువ్వే అని చెప్పారు. దాంతో గుణశేఖర్ దగ్గర ఒక కథ ఉంది వినండి అని మహేష్ బాబు తనతో చెప్పారని అన్నారు. ఆ తర్వాత ఆ కథను విన్నామని…. ముగ్గురం కలిసి ఆ కథపై కూర్చున్నామని చెప్పారు. ఫైనల్ గా ఆ సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు అదే ఒక్కడు సినిమా అని అన్నారు.

ఇక సినిమా కథ ఛార్మినార్ తో ముడిపడి ఉంటుందని దాంతో ఉదయాన్నే చార్మినార్ దగ్గర షూటింగ్ పెట్టుకుందామని మహేష్ బాబు అన్నారని అన్నారు. అప్పటికి మనసంతా నువ్వే హిట్ అవ్వడంతో బాగా లాభాలు వచ్చాయని అందువల్ల ఛార్మినార్ సెట్ వేద్దామని తాను చెప్పినట్టు తెలిపారు. అప్పట్లోనే ఆ సెట్ కు రెండు కోట్లకు పైగా ఖర్చు పెట్టామని అన్నారు.

Also read : ప్రభాస్ ఫ్యాన్స్‌ కు బిగ్‌ షాక్‌..చిక్కుల్లో పడ్డ ఆది పురుష్ సినిమా..?

Visitors Are Also Reading