Home » పెళ్లైన రెండేళ్లకే డైరెక్టర్ క్రిష్ కి విడాకులిచ్చిన భార్య.. కారణం అదేనా ?

పెళ్లైన రెండేళ్లకే డైరెక్టర్ క్రిష్ కి విడాకులిచ్చిన భార్య.. కారణం అదేనా ?

by Anji
Ad

టాలీవుడ్ దర్శకుడు క్రిష్  గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా క్రిష్ డ్ర**గ్స్ కేసులో ఇరుక్కున విషయం తెలిసిందే. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా నిలిచారు. 

Advertisement

Advertisement

ఈ కేసులో మొత్తం 9 మంది ఉండగా.. అందులో దర్శకుడు క్రిష్ కూడా ఒకరు. క్రిష్ ని విచారణకు హాజరు కావాలని సూచించారు పోలీసులు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం క్రిష్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా క్రిష్ విడాకుల విషయం తెరపైకి వచ్చింది. ఫిలింనగర్ లో పలు కథనాలు వినిపిస్తున్నాయి. గతంలో డాక్టర్ అయిన రమ్య వెలగను పెళ్లి చేసుకున్నాడు దర్శకుడు క్రిష్. కానీ కొద్ది రోజుల్లోనే ఆమెతో విడాకులు తీసుకున్నారు.

 

అప్పట్లో వీరిద్దరి ఫీల్డ్ వేర్వేరు కాబట్టి సర్దుకోలేకపోయారని అందుకే విడాకులు తీసుకున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు డ్ర**గ్స్ వ్యవహారం బయటికీ రావడంతో డాక్టర్ రమ్య క్రిష్ గురించి పూర్తిగా తెలుసుకొని విడాకులు తీసుకున్నదని కొందరూ భావిస్తున్నారు. క్రిష్ పై వచ్చిన ఈ ఆరోపణలో వాస్తవాలు ఎలా ఉన్నా.. ఆయన దర్శకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా హరిహరవీరమల్లు పై తీవ్ర ప్రభావం చూపుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయ నాయకుడిగా పవన్ పై ఒత్తిడి ఉంటుందని.. ఈ సినిమాకి తొలుత నుంచి ఉన్న అడ్డంకులకు తోడు ఇప్పుడు డ్ర**గ్స్ వ్యవహారం మరో అడ్డంకి కానున్నట్టు భావిస్తున్నారు.

Visitors Are Also Reading