ఉత్తర కొరియా త్వరలో అణు పరీక్షలకు సిద్ధం అవుతున్నట్టు అమెరికా అంచనా వేస్తోంది. ఉత్తర కొరియాలోని కొన్ని నిర్మాణాలకు సంబంధించి లభించిన శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్టు అమెరికాకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఉత్తర కొరియా చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచానికే పెనుముప్పుగా మారే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
Advertisement
డీఎన్ఐ అంచనా ప్రకారం.. ఉత్తర కొరియాలోని యోంగ్‌బియాన్ ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నట్టు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అణుపరీక్షలు జరపడానికి అనువుగా తాజా నిర్మాణాలు ఉన్నాయని అగ్రరాజ్యం అంచనాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో చివరిసారిగా 2017లో అణు పరీక్షలు జరిగాయి. 2018 దీనిని మూసివేశారు. అప్పటి నుంచి ఆ ప్రదేశంలో ఎలాంటి కదలికలు లేవు. కానీ ప్రస్తుతం నూతనంగా నిర్మాణాలు జరుగుతున్నట్టు అమెరికా గుర్తించింది.
Advertisement
Also Read : రష్యాతో పోరాటం చేసేందుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరిన భారత విద్యార్థి…!
ఈ ప్రదేశంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షతో పాటు అణు పరీక్షలు జరిపేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌తో పాటు సబ్‌మెరైన్ నుంచి ప్రయోగించగలిగే క్షిపణులను సైతం ఉత్తరకొరియా అభివృద్ధి చేస్తోంది. ప్రధానంగా అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ చేపడుతున్న ఈ చర్యలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టనున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా కిమ్ తనదైన దూకుడుతో అమెరికాకు కొరకరాని కొయ్యగా తయ్యారయ్యారని చెప్పుకోవాల్సిందే..!
Also Read : Video Viral : దివ్యాంగ అభిమానికి బహుమతి అందజేసిన విరాట్ కోహ్లీ