Home » Video Viral : దివ్యాంగ అభిమానికి బ‌హుమ‌తి అందజేసిన విరాట్ కోహ్లీ

Video Viral : దివ్యాంగ అభిమానికి బ‌హుమ‌తి అందజేసిన విరాట్ కోహ్లీ

by Anji
Ad

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవ‌ల త‌న కెరీర్‌లో 100వ టెస్ట్ ఆడాడు. ఈ టెస్ట్‌లో భార‌త్ ఇన్నింగ్స్ 222 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఆ మ్యాచ్ అనంత‌రం స్టేడియం నుండి హోట‌ల్‌కు వెళ్తుండ‌గా కోహ్లీ త‌న అభిమానికి అదిరిపోయే గిప్ట్ ఇచ్చాడు. బ‌స్సు ఎక్కుతున్న స‌మ‌యంలో త‌న కోసం వేచి చూస్తున్న ఓ దివ్యాంగ అభిమానిని చూసి కోహ్లీ చ‌లించిపోయాడు.

Advertisement

Advertisement

ఈ త‌రుణంలో త‌న అభిమాని ధ‌రమ్ వీర్ పాల్‌కు విరాట్ కోహ్లీ త‌న జెర్సీని బ‌హుమ‌తిగా ఇచ్చాడు. ఈ విష‌యాన్ని ధ‌ర‌మ్ వీర్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. కోహ్లీ 100వ టెస్ట్ సంద‌ర్భంగా అత‌ని జెర్సినీ త‌న‌కు బ‌హుమ‌తిగా ఇచ్చాడ‌ని పోస్ట్ చేశాడు. దీంతో విరాట్ కోహ్లీపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. విరాట్ కోహ్లీ బ‌హుమ‌తి ఇస్తున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. శ్రీ‌లంక‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌లో కోహ్లీ 45 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిన‌దే.

Visitors Are Also Reading