Home » అఖండ 2 కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

అఖండ 2 కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ-మాసివ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే హిట్ గ్యారంటీ అనే మార్క్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సింహ , లెజెండ్, అఖండ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టాయి.  ఈ కాంబోలో మళ్ళీ మూవీ ఎప్పుడెప్పుడా ఆని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖండ ఇచ్చిన రీసౌండ్ ఇంకా చెవుల్లో ప్రతి ధ్వనిస్తూనే ఉంది. కరోనా మహమ్మారి తరువాత తక్కువ ధరకే టికెట్స్ ఉన్నా సరే .. కలక్షన్ల సునామీ సృష్టించింది. ఈ మూవీ తరువాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో  బాలయ్య వీర సింహా రెడ్డి మూవీతో వచ్చి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

Advertisement

 

తాజాగా భగవంత్ కేసరితో రికార్డుల మోత మోగించాడు. బోయపాటి మాత్రం స్కంద అంటూ రామ్ పోతినేనితో ఓ మూవీ తెరకెక్కించి ప్లాప్ ని మూట గట్టుకున్నాడు. ఇప్పుడు బోయపాటి నెక్స్ట్ మూవీ మళ్ళీ బాలయ్యతోనే చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అఖండలో ద్విపాత్రల్లో బాలయ్య బాబు నటన నభూతో నభవిశ్యత్ అనే రేంజ్లో ఉంది.  అఖండ 2 అంతకుమించి ఆనేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అఖండ2 ఓ డిఫరెంట్ జోనర్లో విభిన్న కథాంశంతో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కబోతోందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ అఖండ2 మూవీతో బాలయ్య బోయపాటి మరో హ్యాట్రిక్ కు శ్రీకారం చుడతారని కచ్చితంగా చెప్పవచ్చు.

Advertisement

అఖండ 2 చిత్రానికి నిర్మాతలు ఎవరు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అఖండ చిత్రాన్ని నిర్మించిన సంస్థ నిర్మాణంలో చేస్తారా.. లేదా వేరే సంస్థలో చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బోయపాటి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.బోయపాటికి  అఖండ 2 విజయం చాలా కీలకం. అయితే ప్రస్తుతం బాలయ్య బాబీ కాంబోలో మూవీ ట్రాక్ లో ఉంది . ఇది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఈ లోపు బోయపాటి బన్నీతో కమిట్ అయిన ఓ ప్రాజెక్టు ట్రాక్ ఎక్కిస్తాడేమో చూడాలి. నందమూరి ఫ్యాన్స్ మాత్రం అఖండ 2 అప్డేట్ కోసం చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. బోయపాటి తో చేయబోయే మూవీ NBK 110 కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading