Home » మార్చి 14న రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ 3 రాశుల వారు పట్టిందల్లా బంగారమే..!

మార్చి 14న రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ 3 రాశుల వారు పట్టిందల్లా బంగారమే..!

by Anji
Ad

సాధారణంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..  గ్రహాలకు , రాశులకు ప్రత్యేక స్థానం ఉంది. నవ గ్రహాల్లో సూర్య గ్రహం ఒకటి. అంతేకాదు గ్రహాలకు అధిపతి కూడా.. అటువంటి సూర్య గ్రహ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంచారం అంటారు. ఈ గ్రహ సంచారం చాలా శుభప్రదంగా భావిస్తారు.  సూర్యుడు ఈ నెలలో తన గమనాన్ని మార్చుకోనున్నాడు. త్వరలో బృహస్పతి రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ నెల 14 తేదీన సూర్యుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఇది చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో కొన్ని రాశులకు చెందిన వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ నేపథ్యంలో మీన రాశిలోకి సూర్యుడి సంచారం వల్ల అదృష్టాన్ని సొంతం చేసుకునే రాశుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

Advertisement

వృషభ రాశి : 

ఈ రాశికి చెందిన వారు సూర్యుడు మీన రాశిలో ప్రవేశించడం వలన అనేక లాభాలను అందుకుంటారు. అంతేకాదు గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. అదే సమయంలో కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పిల్లల నుంచి కూడా ఊహించని శుభవార్తలు వింటారు. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సుఖ సంతోషంగా గడుపుతారు.

Advertisement

కన్యరాశి : 

ఈ రాశి కి చెందిన వారికి సూర్యుడి సంచారం వలన శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. కోరుకున్న కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నం చేస్తున్నవారి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఏర్పడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మొత్తానికి ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆర్థిక పరిస్థితి చాలా సంతృప్తికరంగా ఉంటుంది.

కుంభ రాశి : 

ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్యుడి సంచారంతో అదృష్టం కలిసి వస్తుంది. ఊహించని విధంగా లాభాలను అందుకుంటారు. ఆర్ధిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొత్త పనులు మొదలు పెట్టి ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. అదే సమయంలో ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు కూడా చేస్తారు. వైవాహిక జీవితం కూడా సుఖ సంతోషాలతో సాగుతుంది.

Also Read :  Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశి వారికి పని భారం పెరుగుతుంది

Visitors Are Also Reading