Home » Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశి వారికి పని భారం పెరుగుతుంది

Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశి వారికి పని భారం పెరుగుతుంది

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu : మేష రాశి వారికి ఈ వారం ఆశించిన విజయం సాధిస్తారు. వృషభ రాశి వారికి ఈ వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. మిథున రాశి వారికి ఒత్తిడి కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి.  మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో  ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Weekly Horoscope in Telugu 10.03.2023 నుంచి 16.03.2024 వరకు మేషం :

శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు. ఆశించిన విజయం సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. తోటివారి ప్రోత్సాహం ఉంటుంది. లక్ష్య సాధనలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. పెట్టుబడులు ఫలిస్తాయి.

Weekly Horoscope in Telugu 2024: వృషభం 

లక్ష్యాన్ని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అద్భుతమైన ఫలితాలుంటాయి. సమయానికి అనుకూలంగా వ్యవహరించి పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. ఇంటాబయటా కలిసి వస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో విశేష ధనలాభముంది. 

Weekly Horoscope in Telugu : మిథునం

ఒత్తిడి కలిగించే సంఘటనలున్నాయి. చెడు గురించి ఆలోచించకూడదు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు సఫలమవుతాయి. నూతన పరిచయాలు ఇబ్బంది కలిగిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. పరిస్థితులు సహకరించడం లేదు.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అందుకు తగిన  కృషి చాలా అవసరం. ఎలాంటి పరిస్థితిల్లోనూ అశ్రద్ధ వహించకూడదు. మానవ ప్రయత్నం బలంగా చేయాలి. నలుగురిని కలుపుకొని పోవాలి. 

Weekly Horoscope in Telugu : సింహం

మానసిక దృఢత్వం ధైర్యాన్ని ఇస్తుంది. ప్రతీ విషయం లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొందరి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కలహాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. 

Weekly Horoscope in Telugu కన్య

మిత్రుల వల్ల కొన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. అంతా మీరు అనుకున్న విధంగానే జరుగుతుంది. ప్రతిభతో ప్రశంసలు అందుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక విజయం సాధించే వరకు కృషి చేస్తూనే ఉండాలి. 

Advertisement

Weekly Horoscope in Teluguతుల

వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అంచెలంచెలుగా పైకి వస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో తోటివారితో సున్నితంగా వ్యవహరించాలి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

సకాలంలో పనులు పూర్తి చేస్తే సత్ఫలితాలుంటాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. పనులను మధ్యలో ఆపవద్దు. ఎదురుచూస్తున్న పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. నిరుత్సాహం పనికి రాదు. క్రమంగా కాలం సహకరిస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలు పాటించాలి.

Weekly Horoscope in Telugu ధనుస్సు

ఎటు చూసినా విజయమే కలుగుతుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకోండి. కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో పైకి వస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. జీవిత ఆశయాలు నెరవేరుతాయి. 

Weekly Horoscope in Teluguమకరం

కృషి ఫలిస్తుంది. ఆశించిన ఆర్థిక పరిస్థితి లభిస్తుంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా సాంకేతికమైన అభివృద్ధిని సాధించాలి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ వహించాలి. పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలి. 

Weekly Horoscope in Teluguకుంభం

వ్యాపారపరంగా అభివృద్ధిని సాధిస్తారు. రుణ సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ముఖ్యవిషయాల్లో విజయం లభిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సంతృప్తినిస్తాయి. సమయానుకూలంగా వ్యవహరించాలి. ఒక పని పూర్తి అవుతుంది. 

Weekly Rasi Phalau in Telugu : మీనం

ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. తెలియని ఆటంకాలున్నాయి.  సకాలంలో పనులు పూర్తి చేస్తే మంచిది. మీ యొక్క ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి.  పని భారం పెరుగుతుంది.

మరిన్ని తెలుగు వార్తల  కోసం ఇక్కడ మనం వీక్షిద్దాం.

Visitors Are Also Reading