Home » ఆ స్టార్ హీరో భార్య ఆయనను కొడుతుందట..హింస భరించలేక ఆయన ఏం చేసారంటే..!!

ఆ స్టార్ హీరో భార్య ఆయనను కొడుతుందట..హింస భరించలేక ఆయన ఏం చేసారంటే..!!

by Sravanthi
Ad

కష్టాలనేవి సామాన్యులకే కాకుండా సెలబ్రిటీలకు కూడా ఉంటాయని ఒక స్టార్ హీరో చెప్పుకొచ్చారు. డబ్బు ఉంటే సరిపోదు అని మానసిక శాంతి ఉండాలని తెలియజేశారు. సామాన్యులకే కోర్టులు, కేసులు కాదు సెలబ్రిటీలకు కూడా తప్పడం లేదని అన్నారు. మరి ఎవరు ఆ హీరో.. ఆయన భార్య ఏ విధంగా హింస పెట్టిందో తెలుసుకుందామా..?
తాజాగా ఒక స్టార్ హీరో తన భార్య హింస పెడుతూ, కొడుతుందని కోర్టులో కేసు పెట్టాడు. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అనే మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న హీరో జానీ డెప్.. అంతటి పేరు సంపాదించుకున్న ఆయనకు భార్యతో తిప్పలు తప్పలేదు.

Advertisement

 

హీరో కొన్ని రోజుల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూ తన భార్యతో పోరాడుతున్నాడు. తాజాగా ఆమె రాసిన వ్యాసంపై 380 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కూడా వేశాడు. అసలు ఏం జరిగిందో చూద్దాం..!! జానీ డెప్ మూడు సంవత్సరాల డేటింగ్ తర్వాత నటి అంబర్ హెర్డ్ ను 2015లో రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఒక సంవత్సరం లోపే వారిద్దరి మధ్య వివాదం చెలరేగి సమస్యలు స్టార్ట్ అయ్యాయి. దీంతో రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకొని విడిపోయారు. అయినా అంబర్ తాను ఒక గృహహింస బాధితురాలిని అని ఒక వ్యాసాన్ని రాసింది.

Advertisement

ఇది కాస్త వైరల్ అవడంతో దీన్ని వ్యతిరేకిస్తూ జాన్ కోర్టులో కేసు వేశాడు. తన మాజీ భార్య పై 380 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కూడా వేశారు. ఈ కేసు ప్రస్తుతం వర్జీనియా కోర్టులో రెండో వారానికి చేరుకున్నది. కానీ ఈసారి జాన్ తన భార్య చేసినటువంటి ఆగడాలను తెలియజేశాడు. పెళ్లయిన సంవత్సరానికే మా ఇద్దరి మధ్య వాగ్వాదం వచ్చిందని, ఆమె నన్ను అసభ్యకరమైన మాటలు తిడుతూ, మానసిక వేదనకు గురి చేసి ప్రతిరోజు కొట్టేదనీ అన్నారు. వైన్ గ్లాస్ తలపై విసిరి ఇష్టానుసారంగా ప్రవర్తించేదని తెలిపారు. మానవ మలాన్ని బెడ్ పై వేసేదని ఈ విధంగా నన్ను హింసించి అవమానపరిచేదని జాన్ చెప్పారు. దీంతో అతడి మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

ALSO READ:

ప్రభాస్ యష్ లతో మల్టీ స్టారర్..!

మెగాస్టార్ కు షాక్ ఇచ్చిన శేఖర్ మాస్టర్….అలా చేస్తావా అంటూ ఫ్యాన్స్ ఫైర్….!

 

Visitors Are Also Reading