Home » మెగాస్టార్ కు షాక్ ఇచ్చిన శేఖర్ మాస్టర్….అలా చేస్తావా అంటూ ఫ్యాన్స్ ఫైర్….!

మెగాస్టార్ కు షాక్ ఇచ్చిన శేఖర్ మాస్టర్….అలా చేస్తావా అంటూ ఫ్యాన్స్ ఫైర్….!

by AJAY
Ad

టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. రాకేష్ మాస్టర్ శిష్యుడిగా పరిచయమైన శేఖర్ మాస్టర్ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పలు పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆయన స్టార్ హీరోలతో వేయించిన స్టెప్పులు థియేటర్లలో క్లాప్స్ కొట్టిస్తూ ఉంటాయి. ఇక శేఖర్ మాస్టర్ కేవలం కొరియోగ్రఫీ మాత్రమే కాకుండా టీవీ షోలలో కూడా సందడి చేస్తూ ఉంటారు.

Advertisement

దాంతో ఆయన మిగతా కొరియోగ్రాఫర్ ల కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు శేఖర్ మాస్టర్ సమర్పణలో ధర్మపురి అనే సినిమా కూడా తెరకెక్కింది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో శేఖర్ మాస్టర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో శేఖర్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆచార్య సినిమాలో భలే బంజారా అనే పాటకు రామ్ చరణ్ చీరు కోసం తానే కొరియోగ్రఫీ చేసినట్టు చెప్పారు.

Advertisement

చిరంజీవి తదుపరి సినిమాలోని పాటల గురించి కూడా శేఖర్ మాస్టర్ వెల్లడించారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో ఓ పాటను కంపోజ్ చేసినట్టు వెల్లడించారు. అంతేకాకుండా “వాల్తేరు వీరయ్య” అనే సినిమాలో కూడా ఒక పాట చేశానని శేఖర్ మాస్టర్ తెలిపారు. వాల్తేరు వీరయ్య అనే సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

chiranjeevi

chiranjeevi

అయితే నిజానికి ఈ సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించలేదు. కానీ కొంతకాలంగా ఈ టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక ఇప్పుడు శేఖర్ మాస్టర్ టైటిల్ బయటపెట్టి లీక్ చేశారు. దీంతో తో చిత్ర బృందం టైటిల్ రివీల్ హీసి ఇచ్చే సర్ప్రైజ్ ను అభిమానులకు లేకుండా చేశారు. దాంతో అలా ఎందుకు లీక్ చేశావ్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

 

Also read :

KGFలో అందుడిగా నటించిన తాత ఎవరో తెలుసా….ఆయన బ్రాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు….!

Chanakya Niti : మ‌నిషిని విజ‌య‌ప‌థంలోకి తీసుకెళ్లే ఐదు సూత్రాలు ఇవే..!

Visitors Are Also Reading