Home » రష్మిక చేతిలో 20 సార్లు చెంప దెబ్బలు తిన్న స్టార్ హీరో..!

రష్మిక చేతిలో 20 సార్లు చెంప దెబ్బలు తిన్న స్టార్ హీరో..!

by Anji
Ad

కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.. మొదట టాలీవుడ్ లో ఛలో చిత్రం ద్వారా తన కెరియర్ ను మొదలుపెట్టింది. ఆ తర్వాత గీతాగోవిందం సినిమాతో మంచి క్రేజ్ రావడంతో ఏకంగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్గా కూడా పేరు సంపాదించుకుంది రష్మిక.

Advertisement

సౌత్ స్టార్ స్టేటస్ దక్కిన వెంటనే బాలీవుడ్ వైపుగా అడుగులు వేస్తూ అక్కడ అవకాశాలను అందుకుంది. అలా యానిమల్ వంటి భారీ క్రేజ్ సినిమాలో హీరోయిన్గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపుగా ఈ సినిమా 900 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సలార్ సినిమా రిలీజ్ కావడంతో కాస్త కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ చూపించినట్లుగా తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలోని రష్మిక నటనకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. యానిమల్ సినిమాలో రష్మిక పాత్ర కెరియర్ లో ఇది ఒక బెస్ట్ రోల్ అని కూడా చెప్పవచ్చు.. ఇందులో నటించిన ఆర్టిస్టుల టాలెంట్ ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాగా ఉపయోగించుకున్నారని చెప్పవచ్చు . ముఖ్యంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తాను అనుకున్న స్థాయిలో సీన్స్ వచ్చేవరకు ఎన్ని టేకులైనా చేస్తూ ఉంటారు ఎలాంటి కోపం తెచ్చుకోకుండా ఎదుటి ఆర్టిస్టులకు చిరాకు కలిగిన కూడా పట్టించుకోరు.

Vijay Deverakonda And Rashmika Mandanna Are Dating Each Other

అందుకే ఆయన చేసిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. యానిమల్ చిత్రంలో కర్వా చౌత్ సన్నివేశంకి థియేటర్స్ లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సన్నివేశంలో రష్మిక హీరో రణబీర్ కపూర్ చెంప మీద చాలా బలంగా కొట్టాలి. ఈ సన్నివేశం కోసం ఏకంగా 20 కి పైగా టేకులు తీస్తే కానీ అందులో ఒకటి నచ్చిందట.. అంటే దాదాపుగా 20 సార్లు రష్మిక చేతిలో రణబీర్ చెంప దెబ్బలు తిన్నారన్నమాట. అయితే అన్ని దెబ్బలు తిన్నా కూడా రణబీర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదట.. అలాంటి డెడికేషన్ ఉన్న నటుడ్ని చూసి అభిమానులు సైతం పొగిడేస్తూ ఉండడంతోపాటు రష్మిక కూడా ఆయనని పొగిడింది. ఇకపోతే రణబీర్ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఇక రష్మీక విషయానికొస్తే.. ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప-2 , ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలలో నటిస్తోంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading